Ind Vs WI 2023: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన జట్టులో నలుగురు స్పిన్ బౌలర్లకు చోటు దక్కింది. ఇద్దరు లెగ్ స్పిన్నర్లు యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి.. ఇద్దరు లెఫార్మ్ స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ టీ20 జట్టులో స్థానం సంపాదించారు. విండీస్ గడ్డపై మ్యాచ్‌కు సెలక్టర్లు ఈ మేరకు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సమర్థించాడు.
కరేబియన్ దీవిలో ప్రస్తుతం స్లో, టర్నింగ్ పిచ్‌లు ఉన్న నేపథ్యంలో సెలక్టర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడ్డాడు. ఇక విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజాకు చోటు ఇవ్వకపోవడంపై కూడా ఆకాశ్ చోప్రా స్పందించాడు.
అందుకే జడ్డూ జట్టులో లేడు
తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వెస్టిండీస్‌తో టీ20 జట్టులో నలుగురు స్పిన్నర్లు అక్షర్ పటేల్, యుజీ చహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయికి సెలక్టర్లు చోటిచ్చారు. రవీంద్ర జడేజా లేడు కాబట్టి ఆల్‌రౌండర్ స్థానంలో అక్షర్ పటేల్‌కు తప్ప మరొకరికి స్థానం లేదు.
నా అభిప్రాయం ప్రకారం.. కేవలం జడ్డూపై పని ఒత్తిడి తగ్గించడానికి మాత్రమే అతడిని పక్కన పెట్టి ఉంటారు. నిజానికి టీ20 ఫార్మాట్లో రవీంద్ర జడేజా ప్రదర్శనపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. అయితే, అతడు కరేబియన్ గడ్డపై టెస్టులు, వన్డేలు ఆడాల్సి ఉంది.
పాండ్యా సారథ్యంలో
కాబట్టి జడ్డూకు విశ్రాంతినిచ్చే క్రమంలో మాత్రమే అతడి స్థానంలో అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు. అంతేతప్ప జడ్డూను జట్టు నుంచి తప్పించినట్లు కాదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా ఆగష్టు 3- 13 వరకు టీమిండియా- వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌లో భారత జట్టుకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు.
విండీస్‌తో టి20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టు:
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
చదవండి: Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్
రింకూ సింగ్‌కు గుడ్ న్యూస్.. భారత జట్టులో చోటు! వాళ్లకు కూడా
Comments
Please login to add a commentAdd a comment