టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టి20 మ్యాచ్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ట్రినిడాడ్ నుంచి సెయింట్ కిట్స్‌కు రావాల్సిన ఆటగాళ్ల లగేజీ ఆలస్యం అవడమే అందుకు ప్రధాన కారణం. రాత్రి 8 గంటలకు మొదలుకావాల్సిన మ్యాచ్ ఎట్టకేలకు 11 గంటలకు ప్రారంభం అయింది. టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. రోహిత్ శర్మకు జతగా సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి రావాల్సి ఉంది.
కానీ కొద్దిసేపటి తర్వాత చూస్తే రోహిత్‌తో పాటు వెనుక నుంచి చూస్తే అర్షదీప్ సింగ్ జెర్సీ కనిపించింది. అదేంటి అర్షదీప్ ఓపెనర్‌గా రావడం ఏంటని మనం అనుకునే లోపే జెర్సీ వేసుకున్న వ్యక్తి సూర్యకుమార్ యాదవ్ అని తేలింది. హమ్మయ్యా సూర్యకుమారే ఓపెనర్‌గా వచ్చాడని అంతా అనుకున్నారు. మరి సూర్య తన జెర్సీ కాకుండా అర్ష్‌దీప్ జెర్సీ ఎందుకు వేసుకొచ్చాడనేగా మీ డౌటు.
వాస్తవానికి టీమిండియా ఆటగాళ్ల లగేజీలో కొంతమందివి తొందరగా రాగా.. మరికొంత మందివి ఆలస్యంగా వచ్చాయి. ఆ జాబితాలో సూర్యకుమార్ కూడా ఉన్నాడు. అసలే మ్యాచ్‌లో ఓపెనర్‌గా రావాలి. అటు చూస్తే లగేజీ ఇంకా రాలేదు. దీంతో చేసేదేం లేక సూర్యకుమార్.. అర్షదీప్ సింగ్ జెర్సీ వేసుకొని బ్యాటింగ్‌కు దిగాడు. ఇదీ అసలు కథ. అయితే విండీస్ బ్యాటింగ్ సమయంలో మాత్రం సూర్యకుమార్ తాను జెర్సీ వేసుకొనే ఫీల్డింగ్ చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియాపై వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ అర్థసెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.అంతకముందు భారత్ 19.4 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (0), సూర్యకుమార్ (11), అయ్యర్ (10) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును పంత్ (12 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (31 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కాసేపు ఆదుకున్నారు. జడేజా (30 బంతుల్లో 27; 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. అయితే మెకాయ్ (4–1–17–6) బెంబేలెత్తించాడు.ఇరుజట్ల మధ్య మూడో టి20 ఆగస్టు 2న జరగనుంది.
చదవండి: అందుకే ఆవేశ్ చేతికి బంతి! ఇదొక గుణపాఠం... మా ఓటమికి ప్రధాన కారణం అదే!
Comments
Please login to add a commentAdd a comment