వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తన పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. తొలి టీ20లో దారుణంగా విఫలమైన గిల్.. రెండో టీ20లో కూడా అదే తీరును కనబరిచాడు. గయానా వేదికగా విండీస్‌తో జరిగిన రెండో టీ20లో 9 బంతులు ఎదుర్కొన్న గిల్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ మొదటి బంతి నుంచే విండీస్ బౌలర్లను ఎదుర్కొండానికి శుబ్‌మన్ కష్టపడ్డాడు.
ఈ క్రమంలో మొదటి 6 బంతుల్లో కేవలం ఒక్క పరుగులు చేశాడు. అయితే భారత ఇన్సింగ్స్ మూడో ఓవర్ వేసిన అల్జారీ జోషఫ్ బౌలింగ్‌లో గిల్ సిక్స్ బాది తన బౌండరీ ఖాతాను తెరిచాడు. కానీ ఆ తర్వాతి బంతికే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. ఇక రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన గిల్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.
అతడి స్ధానంలో యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు. గిల్ ఐపీఎల్‌లో తప్ప ఇంకా ఆడడని, భారత పిచ్‌లపై మాత్రమే బ్యాటింగ్ చేయగలడని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో విండీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం ఫ్లోరిడా వేదికగా జరగనుంది.
చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్.. తొలి భారత క్రికెటర్‌గా!
6(11), 10(12) in Tests...7(16) in 1st ODI and now 3(9) in 1st T20 & 7(9) in 2nd T20.....what a memorable Test this Generational talent guy having 🔥🔥
— TukTuk Academy (@TukTuk_Academy) August 6, 2023
Shubhman Gill what a performer❤️🔥🙌 #WIvIND pic.twitter.com/OJXSu6dZc8
Agar Ruturaj Gaikwad 2 match me fail ho jata to usko turant drop karke Dravid Yashasvi Jaiswal ko khila deta
— Sir Anthoni Sir (@SirAnthoniSir) August 6, 2023
But This shameless Dravid won't drop Ishan Kishan and Shubman Gill despite failing continuously.. #SackDravid #INDvsWI pic.twitter.com/Qh79F16QXv
Comments
Please login to add a commentAdd a comment