Fans Disappointed as Shubman Gill's Lean Patch Continues Against WI - Sakshi
Sakshi News home page

#Shubman Gill: అరెరె! జస్ట్‌ 94 పరుగులతో మిస్‌.. అక్కడ ఆడి ఉంటేనా!

Published Wed, Aug 9 2023 11:00 AM | Last Updated on Wed, Aug 9 2023 11:28 AM

Fans Disappointed as Gills Lean Patch Continues Against WI - Sakshi

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఆటతీరు మారలేదు. వరుసగా మూడో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. గయానా వేదికగా విండీస్‌తో జరిగిన మూడో టీ20లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అల్జారీ జోషఫ్‌ బౌలింగ్‌లో చెత్త షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను గిల్ కోల్పోయాడు. ఇక ఐపీఎల్‌-2023లో అదరగొట్టిన గిల్‌..  ఆ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తన స్ధాయికి తగ్గట్టు ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో 890 పరుగులతో గిల్‌ ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ  ఐపీఎల్‌ తర్వాత ఓవరాల్‌గా 10 ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్‌.. ఎనిమిదింట్లో తీవ్ర నిరాశపరిచాడు. ఈ క్రమంలో వరుసగా విఫలమవుతున్న గిల్‌పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. "గిల్‌ ఆడాలంటే అర్జెంటుగా అహ్మదాబాద్‌ పిచ్‌ను తయారు చేయండి" అంటూ దారుణంగా ట్రోలు చేస్తున్నారు.

ఓ యూజర్‌ స్పందిస్తూ.. "జస్ట్‌ 94 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడంటూ" సెటైర్‌ వేశాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. కీలమైన మూడో టీ20 గెలిచి సిరీస్‌ రేసులో టీమిండియా నిలిచింది.  ఈ మ్యాచ్‌లో విండీప్‌ను 7 వికెట్ల తేడాతో భారత్‌ చిత్తు చేసింది.  భారత విజయంలో సూర్యకుమార్‌ యాదవ్‌(44 బంతుల్లో 83) కీలక పాత్ర పోషించాడు.
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. మా సత్తా చూపించాం! అతడు మరోసారి: హార్దిక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement