Shubman Gill And Kuldeep Yadav Move Up In Latest T20I Rankings - Sakshi
Sakshi News home page

T20I Rankings: సత్తా చాటిన శుబ్‌మన్‌, కుల్దీప్‌.. కెరీర్‌లోనే బెస్ట్‌ ర్యాంక్‌

Published Thu, Aug 17 2023 10:44 AM | Last Updated on Thu, Aug 17 2023 1:40 PM

Shubman Gill and  Kuldeep Yadav move up in T20I Rankings  - Sakshi

ఐసీసీ టీ20 ర్యాకింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ సత్తాచాటాడు. తన టీ20 కెరీర్‌లో ఉత్తమ ర్యాంక్‌ను గిల్‌ సాధించాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో గిల్‌ 43 స్ధానాలు ఎగబాకి 25వ స్ధానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో గిల్‌ అద్బుతమైన హాఫ్‌ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గిల్‌ 77 పరుగులు సాధించాడు.

ఈ అద్బుత ఇన్నింగ్స్‌ ఫలితంగా గిల్‌ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. మరోవైపు నాలుగో టీ20లో ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన యువ సంచలనం యశస్వీ జైశ్వాల్‌ ఏకంగా 1000 స్ధానాలు ఎగబాకి 88వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో జైశ్వాల్‌ 84 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

ఇక వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో అద్బతప్రదర్శన కనబరిచిన టీమిండియా స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 907 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. సెకెండ్‌ ర్యాంక్‌లో పాకిస్తాన్‌ ఆటగాడు మహ్మద్‌ రిజ్వాన్‌(811) ఉన్నాడు. బౌలర్ల విషయానికి వస్తే.. భారత లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఏకంగా 23 స్థానాలు మెరుగుపర్చుకుని 28వ ప్లేస్‌కు చేరుకున్నాడు. 
చదవండి: IND vs WI: ఐర్లాండ్‌తో తొలి టీ20.. సంజూ శాంసన్‌పై వేటు! సిక్సర్ల కింగ్‌ ఎంట్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement