గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన కీలక మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ గెలిచే అవకాశాలను భారత జట్టు సజీవంగా నిలుపుకుంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ముందుగా చక్కటి బౌలింగ్‌తో వెస్టిండీస్‌ను కట్టడి చేసిన భారత్.. ఆ తర్వాత సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో బ్రెండన్ కింగ్(42), రావ్‌మన్ పావెల్(40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు.
సూర్య ప్రతాపం..
ఇక 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. అరంగేట్ర ఆటగాడు యశస్వి జైస్వాల్ (1) ప్రభావం చూపలేకపోగా గిల్ (6) నిరాశపరిచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. విండీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. అతడితో పాటు యువ బ్యాటర్ తిలక్ వర్మ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 37 బంతుల్లో 49 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని హార్దిక్ సేన ఛేదించింది. దీంతో సిరీస్ అధిక్యాన్ని 1-2 భారత్ తగ్గించింది.
కీలక మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఆఖరి మూడు మ్యాచ్‌లు మాకు చాలా ముఖ్యమని బాయ్స్‌కు ముందే చెప్పాను. వరుసగా రెండు ఓటములు మా జట్టుపై ఎటువంటి ప్రభావం చూపలేదు. అలా అని మా ప్రణాళికలు కూడా మేము మార్చుకోలేదు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లలో మేము ఎలా ఆడాతామన్నది చూపించాం. పూరన్ కాస్త ఆలస్యంగా బ్యాటింగ్ రావడం మాకు చాలా సహాయపడింది.
ఎందుకంటే మా పేసర్లను డెత్ బౌలింగ్ వరకు ఉంచగల్గాను. పూరన్ క్రీజులో లేకపోవడంతో అక్షర్ కూడా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. పూరన్‌కు వ్యతేరేకంగా మేము పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాం. అతడు క్రీజులో ఉన్నప్పుడు నేనే బౌలింగ్ చేయాలని నిర్ఱయించుకున్నాం. కాబట్టి నిక్కీ(పూరన్) హిట్టింగ్ చేయలాంటే నా బౌలింగ్‌లోనే చేయాలి. ఇటువంటి పోటీని నేను ఆనందిస్తాను. ఈ మాటలు పూరన్ వింటాడని నాకు తెలుసు.
బహుశా నాలుగో టీ20లో నన్ను టార్గెట్ చేయవచ్చు. ఈ మ్యాచ్‌లో మేము ఏడుగురు బ్యాటర్లతో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాము. బ్యాటర్లు కలిసికట్టుగా రాణిస్తే ఎనిమిదో నంబర్‌లో ఎవరున్న అవసరం లేదు. సూర్య మరోసారి తనంటో చూపించాడు. సూర్యకుమార్ లాంటి ఆటగాడు జట్టులో వుంటే ఇతరలకు ఆదర్శంగా నిలుస్తాడు. ఇక తిలక్ కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడని హార్దిక్ పోస్ట్ ప్రేజేంటేషన్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IND vs WI: సూర్య సంచలన ఇన్నింగ్స్.. మూడో టీ20లో భారత ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment