ఐపీఎల్‌కు ముందు సిక్సర్ల వర్షం కురిపించిన తిలక్‌ వర్మ.. | Tilak Varma slams huge sixes in nets during MIs training session ahead of IPL 2024 | Sakshi
Sakshi News home page

IPL 2024: ఐపీఎల్‌కు ముందు సిక్సర్ల వర్షం కురిపించిన తిలక్‌ వర్మ.. వీడియో వైరల్‌

Published Tue, Mar 19 2024 12:00 PM | Last Updated on Tue, Mar 19 2024 12:48 PM

Tilak Varma slams huge sixes in nets during MIs training session ahead of IPL 2024 - Sakshi

ఐపీఎల్‌-2024 సీజన్‌కు మరో రెండు రోజుల్లో తెరలేవనుది. మార్చి 22న చెపాక్‌ వేదికగా తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌ కోసం ఇప్పటికే మొత్తం అన్ని జట్లు తమ అస్త్ర, శాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ యువ ఆటగాడు తిలక్‌ వర్మ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 

వాంఖడేలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్‌ క్యాంప్‌లో సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కాగా ఐపీఎల్‌-2022 సీజన్‌తో ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తిలక్‌.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇప్పటివరకు 25 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన ఈ యువ సంచలనం.. 740 పరుగులు చేశాడు. అందులో 3 హాఫ్‌ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీలోనూ వర్మ సత్తాచాటాడు. ఏకంగా మూడు సెంచరీలను తిలక్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇప్పుడు అదే దూకుడును ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని ఈ హైదరాబాదీ ఊవ్విళ్లరుతున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో ముంబై ఇండియన్స్‌ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 24 అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది.
చదవండి: Hardik Pandya: అప్పటికే ఫిట్‌గా ఉన్నా.. టీమిండియాకు ఆడకపోవడానికి కారణం ఇదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement