ఊర్వశి రౌతేలా చేసింది ఆరు సినిమాలు.. ఆస్తి రూ. 300 కోట్లు ఎలా? | Urvashi Rautela Financial Sources; Check Details | Sakshi
Sakshi News home page

Urvashi Rautela: హీరోయిన్‌ ఊర్వశి రౌతేలా లగ్జరీ లైఫ్‌ సీక్రెట్‌ ఇదేనా.. అసలు నిజం తెలిస్తే..?

Published Sun, Oct 22 2023 1:02 PM | Last Updated on Sun, Oct 22 2023 1:31 PM

Urvashi Rautela Financial Sources - Sakshi

బాలీవుడ్ హాట్ బ్యూటీలలో ఒకరు ఊర్వశి రౌతెలా.. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరుస్తూ యువతలో మంచి క్రేజ్‌ను అందుకుంది..  ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ బ్యూటీ 15 సంవత్సరాల వయస్సులోనే తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. అలా మిస్ టీన్ ఇండియా 2009 టైటిల్‌ను కూడా గెలుచుకుంది. చైనాలో జరిగిన మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ది ఇయర్ 2011 టైటిల్‌ను కూడా గెలుచుకుంది, ఈ పోటీలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా ఆమె నిలిచింది.

అలా 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఆమె హేట్ స్టోరీ 4, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే, పగల్‌పంతి, మరెన్నో చిత్రాలలో నటించి అలరించింది. కానీ ఆమెకు పెద్దగా సినిమా ఛాన్స్‌లు దక్కలేదు. దీంతో చేతిలో  అంతగా డబ్బులేదు.. సినిమా ఛాన్స్‌లు ఇస్తామని ఆమెను మోసం చేసిన వారే ఎక్కువ కావడంతో అలా ఆమె సినీ కెరీయర్‌ ముగిసిపోయిందని అనుకుంది.

(ఇదీ చదవండి: తప్పని పరిస్థితిలో నేడు మీడియా ముందుకు హీరో రవితేజ)

సరిగ్గా అదే సమయంలో  ఊర్వశికి భారత క్రికెటర్‌ హర్థిక్‌ పాండ్యాతో పరిచయం కావడమే కాకుండా ఆయనతో డేట్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో సినిమా ఛాన్స్‌ల కోసం బాలీవుడ్‌ నిర్మాత సమీర్‌ నాయర్‌తో కూడా ఆమె డేట్‌ చేస్తున్నట్లు తెరపైకి వచ్చింది. ఆమె కంటే సమీర్‌ వయసులో చాలా పెద్దవాడు అయినా సినిమా అవకాశాల కోసం ఆయనతో టచ్‌లో ఉండేదని సమాచారం. కానీ అతను మాత్రం ఆమెకు ఛాన్స్‌లు ఇస్తానంటూ కాలయాపన చేస్తున్నట్లు గ్రహించిన ఊర్వశి నెమ్మదిగా అతనికి గుడ్‌బై చెప్పేసింది.

ఎలాగైనా బాలీవుడ్‌లో ఒక్క ఛాన్స్‌ వస్తే తన టాలెంట్‌తో లైఫ్‌లో సెటిల్‌ కావచ్చని ఆమె కలలు కనేది.  అలా టీ సిరీస్‌ అధినేత భూషణ్‌ కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆయన ఊర్వశికి పాగల్‌ పంథీ సినిమాలో ఒక హీరోయిన్‌గా ఛాన్స్‌ ఇచ్చాడు. ఆ సినిమా ప్లాప్‌ అయినా వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అలా ఆయనతో కూడా ఊర్వశి డేట్‌ చేసినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది.

సినిమా గ్లామర్‌ ఫీల్డ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఆమెకు రిషబ్‌ పంత్‌ ఒక ఫంక్షన్‌లో పరిచయం కావడం ఆపై కొంత కాలం డేట్‌ చేసినట్లు వార్తలు వచ్చినా రిషబ్‌ తిప్పికొట్టాడు. మొదట రిషబ్‌ తన సోషల్‌ మీడియాలో ఊర్వశిని బ్లాక్‌ చేయడంతో వీరిద్దరూ మీడియాలో ప్రధాన వార్తలుగా మిగిలారు. తర్వాత కొద్దిరోజుల పాటు ఇద్దరూ పరోక్షంగా ఒకరిపైమరొకరు సోషల్‌ మీడియాలో కామెంట్లు,స్టేటస్‌లు పెట్టుకోవడంతో వారిద్దరి మధ్య ఎఫైర్‌ నిజమేనని వార్తలు వచ్చాయి.

సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఊర్వశి రౌతెలా ఇప్పటి వరకు ప్రధాన హీరోయిన్‌గా కేవలం 6 సినిమాలు మాత్రమే చేసింది. అవి కూడా అంతగా చెప్పుకోతగినవి కాదు. అడపాదడపా ఐటమ్‌ సాంగ్స్‌లలో కనిపించేది. దీంతో ఆమెకు పెద్దగా ఇన్‌కమ్‌ సోర్స్‌ కనిపించలేదు. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 11 ఏళ్లలోనే ఆమె రూ. 150 కోట్లు పెట్టి ముంబైలో ఒక పెద్ద బంగ్లా కొనింది. ఈ డబ్బంతా దుబాయ్‌,యూకే,కెనడా వంటి దేశాల్లో ఈ బ్యూటీ గ్లామర్‌తో కొల్లగొట్టిందని ప్రచారం ఉంది.

అందాల పోటీల్లో పాల్గొన్న అమ్మాయిలకు  దుబాయ్‌లో ఎక్కువ క్రేజ్‌ అట. అక్కడి షేక్స్‌ కూడా ఎక్కువగా వారినే ఇష్టపడి ట్రాప్‌ చేస్తారట. అలా అందాల పోటీల్లో పాల్గొన్న అమ్మాయిల్ని దక్కించుకునేందుకు వారు ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తారట. ఇలా ఊర్వశి కేవలం 11 ఏళ్ల సినిమా కెరియర్‌లో సంపాదించలేనిది కేవలం రెండు సంవత్సరాల్లోనే సుమారు రూ. 300 కోట్లు వెనుకేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా సినిమా ఛాన్స్‌ల కోసం ఆమె శ్రీదేవి భర్త బోణీ కపూర్‌తో డేట్‌ చేస్తున్నట్లు బాలీవుడ్‌ ఇండస్ట్రీలో వైరల్‌ అవుతుంది. వీరిద్దరూ కలిసి పార్టీలు,వెకేషన్‌లు అంటూ చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement