(PC: BCCI/Sportzpics)
ఐపీఎల్-2024కు ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌లో చేరనున్నాడని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా లెజెండ్, ఆర్సీబీ మాజీ ఆటగాడు ఎబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ హార్దిక్ ముంబైలోకి వెళ్తే కచ్చితంగా రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడని డివిలియర్స్ జోస్యం చెప్పాడు.
కాగా హార్దిక్ పాండ్యా తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి 2021 సీజన్‌కు వరకు ముంబై ఇండియన్స్‌కే ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఐపీఎల్-2023 మేగా వేలానికి ముందు ముంబై అతడిని విడిచిపెట్టింది. ఈ క్రమంలో వేలంలోకి వచ్చిన అతడిని కొత్త ప్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ రూ.15 కోట్ల భారీ ధరకు కొనుగొలు చేసింది. అంతేకాకుండా ఐపీఎల్-2022లో తమ జట్టు పగ్గాలు కూడా అప్పగించింది.
అరంగేట్ర సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్స్‌గా నిలిపి హార్దిక్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2023లో కూడా గుజరాత్‌ను రన్నరప్‌గా నిలిపాడు.హార్దిక్ తిరిగి ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లనున్నాడని తెలుస్తోంది. నిజంగా ముంబై ఇండియన్స్ ఇది పెద్ద వార్త. హార్దిక్ వరల్డ్ క్లాస్ క్రికెటర్. అతడు చాలా కాలంగా ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. వాంఖడే స్టేడియంలో ఆడటానికి ఎక్కువగా ఇష్టపడతాడు.
అయితే రోహిత్ తన కెప్టెన్సీని హార్దిక్ పాండ్యాకు అప్పగించేస్తాడని నేను అనుకుంటున్నాను. రోహిత్‌పై కెప్టెన్సీ పరంగా చాలా ఒత్తిడి కలిగి ఉన్నాడు. ఎందుకంటే టీమిండియా కెప్టెన్‌గా కూడా అతడు కొనసాగుతున్నాడు. రోహిత్ వర్క్‌లోడ్‌ను తగ్గించేందుకే ముంబై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. కాగా పాండ్యా తన కెరీర్‌లో ఇప్పటివరకు 123 మ్యాచ్‌లు ఆడి 2309 పరుగులతో పాటు 53 వికెట్లు సాధించాడు.
చదవండి: మంచి మనసు.. ఓ వ్యక్తి ప్రాణం కాపాడిన మహ్మద్ షమీ! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment