
వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. ఇప్పుడు మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆక్టోబర్ 29న లక్నో వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌తో భారత తలపడనుంది. వరుసగా ఊహించని అపజయాలతో సతమతవుతున్న ఇంగ్లండ్.. టీమిండియా మ్యాచ్‌తో కమ్‌బ్యాక్ ఇవ్వాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
అయితే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ కోలుకున్నప్పటికి టోర్నీ సెకెండాఫ్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టు మేనెజ్‌మెంట్ విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
అతడి స్ధానంలో సూర్యకుమార్ యాదవ్‌ను కొనసాగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ లో ఉన్న పాండ్యా.. ఒకట్రెండు రోజుల్లో లక్నోలో జట్టుతో కలవనున్నాడు. కాగా ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ ఎడమ కాలికి గాయమైంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌కూ పాండ్యా దూరమయ్యాడు.
చదవండి: బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా భారీ విజయం
Comments
Please login to add a commentAdd a comment