
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అదరగొడుతున్నాడు. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా నిప్పులు చేరిగాడు. ఈ మ్యాచ్‌లో 6.5 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. 32 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌లలో 14 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ నేపథ్యంలో బుమ్రాపై పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కొత్త బంతితో బుమ్రా అద్భుతాలు సృష్టిస్తున్నాడని బుమ్రా కొనియాడాడు.బుమ్రా పవర్ ప్లేలో అద్బుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలే సత్తా బుమ్రాకు ఉంది.
బ్యాటర్ మూమెంట్స్‌కు తగ్గట్టుగా బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడు. కొత్త బంతితో బుమ్రా నాకంటే బాగా బౌలింగ్ చేస్తున్నడంలో ఎలాంటి సందేహం లేదు. వరల్డ్ క్రికెట్‌లో నా వరకు అయితే బుమ్రానే అత్యుత్తమ బౌలర్ అని ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ అక్రమ్ పేర్కొన్నాడు.
చదవండి: శ్రీలంక క్రికెట్ జట్టు వీరాభిమాని మృతి.. సంతాపం తెలిపిన దిగ్గజ క్రికెటర్లు
Comments
Please login to add a commentAdd a comment