వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో దూసుకువెళ్తున్న టీమిండియాకు బ్యాడ్ న్యూస్. భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రావడానికి మరికొంత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. చీలమండ గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా నేరుగా సెమీఫైనల్స్‌కు అందుబాటులోకి రానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
కాగా ప్రస్తుతం గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టిన పాండ్యా.. నవంబర్ 12న నెదర్లాండ్స్‌తో జరిగే టీమిండియా చివరి లీగ్ మ్యాచ్‌కు అందబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ సెమీఫైనల్స్ దృష్ట్యా డచ్‌తో మ్యాచ్‌లో హార్దిక్‌ను ఆడించి రిస్క్ తీసుకోకూడదని జట్టు మేనెజ్‌మెంట్ భావించినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే మిగిలిన లీగ్ మ్యాచ్‌లకు హార్దిక్ దూరం కానున్నాడు. హార్దిక్ ప్రస్తుతం బాగా కోలుకుంటున్నాడు. అతడు తిరిగి సెమీఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. హార్దిక్ స్ధానంలో సూర్యకుమార్ యాదవ్‌ను కొనసాగించే ఛాన్స్ ఉంది.
చదవండి: World Cup 2023: వరల్డ్ నెంబర్ 1 బౌలర్‌గా షాహిన్ అఫ్రిది..
Comments
Please login to add a commentAdd a comment