టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అటు వ్యక్తిగత జీవితంలోనూ, ఇటు ప్రొఫెషనల్‌గాను హార్దిక్ గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలకడంతో భారత తదుపురి టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యానే అంతా భావించారు.
కానీ బీసీసీఐ మాత్రం పాండ్యాకు ఊహించని షాకిచ్చింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ టీమిండియా టీ20 కెప్టెన్‌గా పాండ్యాను కాదని స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌ను నియమించింది. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక సందర్భంగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే శ్రీలంక పర్యటనకు జట్టు ప్రకటించిన కొద్ది సేపటికే హార్దిక్ మరో బాంబు పేల్చాడు. గత కొన్ని నెలలగా తమ వైవాహిక జీవితానికి సంబంధించి వస్తున్న రూమర్స్‌ను హార్దిక్ పాండ్యా, అతడి భార్య నటాషా స్టాంకోవిచ్ నిజం చేశారు. హార్దిక్ పాండ్య- నటాషా తామిద్దరూ విడిపోతున్నట్లు ఉమ్మడి ప్రకటన ద్వారా తెలియజేశారు.
"మా 4 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాము. మేము కలిసిండేందుకు అన్ని విధాల ప్రయత్నం చేశాము. కానీ విడిపోవడమే ఉత్తమమని మేమిద్దరం భావించాము. పరస్పర గౌరవం, ఆనందంతో కలిసి ఒక కుటంబంగా ఎదిగిన తర్వాత విడిపోవడం నిజంగా కష్టమే.
కానీ ఈ కఠినమైన నిర్ణయం తీసుకొక తప్పట్లలేదు. మా ఇద్దరి జీవితాల్లోనూ అగస్త్య భాగంగా ఉంటాడు. అగస్త్యకు కో పెరెంట్‌గా మేము కొనసాగుతాం. అతని ఆనందం కోసం మేం ఏమైనా చేస్తాం. ఈ క్లిష్టమైన సమయంలో మాకు మీ మద్దతు కావాలి. మా గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’’ అని ప్రకటనలో హార్దిక్, నటాషా పేర్కొన్నారు.
అయితే ఈ క్టిష్టసమయంలో హార్దిక్‌కు అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. కమాన్ హార్దిక్.. నీకు మేము ఉన్నాము అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. మరి కొందరు అయ్యో హార్దిక్.. నీకేందుకు ఇన్ని కష్టాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఐపీఎల్-2024 సమయంలోనూ పాండ్యా దారుణమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన పాండ్యా అటు సారథిగా, ఇటు ఆటగాడిగా విఫలయ్యాడు. దీంతో పాండ్యాను దారుణంగా ట్రోలు చేశారు. అయితే టీ20 వరల్డ్‌కప్-2024లో పాండ్యా దుమ్ములేపడంతో ఒక్కసారిగా హీరో అయిపోయాడు. తిట్టిన నోళ్లే అతడిని ప్రశించాయి.
Stay strong 🥺💔 #HardikPandya pic.twitter.com/aByDFMkRqH
— rj facts (@rj_rr1) July 18, 2024
Comments
Please login to add a commentAdd a comment