ఆసియా కప్ సూపర్-4లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 10) భారత్-పాకిస్తాన్ జట్లు కొలంబో వేదికగా తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఈ బ్లాక్‌బ్లాస్టర్ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో తన రోల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆల్‌రౌండర్ అయినందున మిగితా వారికంటే తనపై వర్క్‌లోడ్ ఎక్కువ ఉంటుందని హార్దిక్ తెలిపాడు. కాగా ఈ మెగా టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 87 పరుగులతో హార్దిక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. టాపార్డర్ విఫలమైన చోట హార్దిక్ సత్తాచాటాడు. మరోసారి సూపర్-4లో కూడా పాక్‌పై అదరగొట్టేందుకు హార్దిక్ సిద్దమవుతున్నాడు.
ఈ నేపథ్యంలో స్టార్‌స్పోర్ట్స్ ఫాలో ది బ్లూస్ షోలో హార్దిక్ మాట్లాడుతూ.. "ఒక ఆల్‌రౌండర్‌గా నా పనిభారం అందరికంటే డబుల్ లేదా ట్రిపుల్ ఉంటుంది. జట్టులోని ఒక బ్యాటర్ బ్యాటింగ్ చేసే అంతవరకే తన పని. కానీ నేను మాత్రం బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ కూడా చేయాలి. కాబట్టి అందుకు తగ్గట్టు నేను ముందే సిద్దమవుతాను. ప్రీ-క్యాంప్ సీజన్‌లో మొత్తం ట్రైనింగ్ తీసుకుంటాను. అయితే ఏదైనా మ్యాచ్‌కు ముందు జట్టుకు ఏదో అవసరం దానిపై ఎక్కువగా దృష్టి సారిస్తాను.
ఒకవేళ నేను 10 ఓవర్లు చేయాలని జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయిస్తే.. 10 ఓవర్లు పూర్తి చేస్తా. అవసరం లేదంటే నాకు అప్పగించిన కోటా పూర్తి చేస్తాను. జట్టు అవసరం బట్టి ముందుకు వెళ్తా. నేను ఎప్పుడు కూడా మ్యాచ్ పరిస్థితిని ఆర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. విజయం సాధించాలంటే మనపై మనంకు నమ్మకం ఉండాలి. ఈ వరల్డ్‌లో నీకు నీవే బెస్ట్ అని భావించాలి. నీ గెలుపుకు నీవే కారణం కావాలి" అని పేర్కొన్నాడు.
చదవండి: ఇంగ్లండ్‌తో సిరీస్ నాటికి అందుబాటులోకి పంత్?; అలాంటి బ్యాటర్ కావాలి: రోహిత్
Comments
Please login to add a commentAdd a comment