ఆసియాకప్-2023లో భాగంగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో సూపర్-4కు భారత అర్హత సాధించింది. ఇక వర్షం దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన చర్యతో నవ్వులు పూయించాడు. కాగా నేపాల్ ఇన్నింగ్స్ సందర్భంగా పలుమార్లు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం గ్రౌండ్ స్టాప్‌కు కూడా చుక్కలు చూపించింది.
అంపైర్‌ను హగ్ చేసుకున్న హార్దిక్..
నేపాల్ ఇన్నింగ్స్ 34 ఓవర్ ఆఖరిలో వర్షం ఒక్కసారిగా కురిసింది. దీంతో వెంటనే గ్రౌండ్ స్టాప్ కవర్లు తీసుకుని మైదానంలోకి వచ్చారు. అంపైర్‌లు కూడా స్టంప్స్‌ను తొలిగించారు. కానీ వర్షం మాత్రం ఆగిపోయింది. ఈ క్రమంలో కవర్లు తీసుకుని వచ్చిన గ్రౌండ్ స్టాప్ కూడా మైదానం మధ్యలో ఆగిపోయారు. దీంతో మళ్లీ వారు వెనక్కి తీసుకువెళ్లాలని నిర్ణయించకున్నారు.
వారు వెనక్కి వెళ్లాలనుకున్న సమయంలో మళ్లీ వర్షం వచ్చింది. ఇది చూసిన హార్దిక్ పాండ్యా గట్టిగా నవ్వుకున్నాడు. ఈ క్రమంలో హార్దిక్ పక్కనే ఉన్న అంపైర్‌ను నవ్వుతూ కౌగిలించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక భారత్ సూపర్-4 దశలో సెప్టెంబర్ 10న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మరోసారి తలపడనుంది.
చదవండి: World Cup 2023: నేడు భారత ప్రపంచకప్ జట్టు ప్రకటన.. ఎవరూ ఊహించని ఆటగాడి ఎంట్రీ!
— Nihari Korma (@NihariVsKorma) September 4, 2023
Comments
Please login to add a commentAdd a comment