మనసులు గెలుచుకున్నాడు.. హార్దిక్‌ షూ లేస్‌ కట్టిన పాక్‌ స్టార్‌ క్రికెటర్‌ | Spirit of cricket shines as Shadab Khan ties Hardik Pandyas shoe lace | Sakshi
Sakshi News home page

IND vs PAK: మనసులు గెలుచుకున్నాడు.. హార్దిక్‌ షూ లేస్‌ కట్టిన పాక్‌ స్టార్‌ క్రికెటర్‌

Published Sun, Sep 3 2023 10:57 AM | Last Updated on Sun, Sep 3 2023 12:50 PM

Spirit of cricket shines as Shadab Khan ties Hardik Pandyas shoe lace - Sakshi

ఆసియాకప్‌-2023లో పాకిస్తాన్‌-భారత్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. భారత ఇన్నింగ్స్‌ తర్వాత ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో మ్యాచ్‌ను అంపైర్‌లు రద్దు చేశారు. మ్యాచ్‌ రద్దైనప్పటికీ ఇరు జట్లకు కొన్ని సానుకూల ఆంశాలు ఉన్నాయి.

భారత టాపర్డర్‌ విఫలమైనచోట హార్దిక్‌ పాండ్యా, ఇషాన్‌ కిషన్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి అందరని ఆకర్షించగా.. పాక్‌ పేసర్లు అఫ్రిది, రౌఫ్‌, నసీం షా సంచలన ప్రదర్శన చేశారు.

శభాష్ షాదాబ్‌..
ఇక వర్షం కారణంగా రద్దైన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పాకిస్తాన్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ తన క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌ సందర్భంగా హార్దిక్‌ పాండ్యా షూ లేస్‌లను కట్టి అందరి మనసులను గెలుచుకున్నాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తలు ఉన్నప్పటికీ.. ఆటగాళ్ల మధ్య మాత్రం మంచి స్నేహబంధం ఉంది. ఇక భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్‌ 4న నేపాల్‌తో తలపడనుంది.


చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్‌ బౌలర్‌ ఓవరాక్షన్‌.. బుద్దిచెప్పిన హార్దిక్‌ పాండ్యా! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement