ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్‌కు సిద్దమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది భారత ఆటగాళ్లు ఆయా జట్లతో చేరారు. ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.
ఇక ఈ ఏడాది సీజకు ప్రారంభానికి ముందు టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, ఆర్సీబీ ఆటగాడు దినేష్ కార్తీక్ క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గోన్నాడు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీకు ఓ ఊహించని ప్రశ్న ఎదురైంది. ప్రస్తుత భారత జట్టులో కీలక ఆటగాడు ఎవరన్న ప్రశ్న కార్తీక్‌కు ఎదురైంది. టీమిండియాలో హార్దిక్ పాండ్యా అత్యంత ముఖ్యమైన ఆటగాడు అంటూ కార్తీక్ బదులిచ్చాడు.
"ప్రస్తుత భారత జట్టులో హార్దిక్ పాండ్యా చాలా కీలకమైన ఆటగాడు. ఎందుకంటే హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో అద్భుతంగా రాణించగలడు. పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. భారత జట్టులో ఇద్దురు ముగ్గరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. కానీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్-రౌండర్లు చాలా అరుదుగా ఉంటారు. వారిలో హార్దిక్ ఒకడు. పాండ్యా మిడిలార్డర్‌లో చాలా ముఖ్యమైన ఆటగాడు.
చాలా మ్యాచ్‌ల్లో తన బ్యాటింగ్‌తో జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. ఇక బౌలింగ్‌లో కూడా చాలా తెలివగా వ్యవహరిస్తాడు. ఎక్కువ షార్ట్ బాల్స్ వేసి బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. ఆస్ట్రేలియా సిరీస్ ఆఖరి వన్డే మిచిల్ మార్ష్‌ను ఓ అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.
అదేవిధంగా ట్రావిస్ హెడ్‌ని కూడా పుల్ షాట్ ఆడించి వికెట్ కోల్పోయేలా చేశాడు. హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాడు భారత జట్టుకు చాలా అవసరం. అతడు జట్టులో లేకపోతే టీమిండియా రాణించడం చాలా కష్టం" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: మరో కొత్త అవతారమెత్తనున్న బాలయ్య.. ఐపీఎల్ కామెంటేటర్‌గా..!
Comments
Please login to add a commentAdd a comment