ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి పాలైన భారత జట్టు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటుంది. అనంతరం వచ్చే నెలలో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా టీమిండియా ఆతిథ్య విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
ఈ సిరీస్‌లకు బీసీసీఐ వచ్చే వారంలో భారత జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను తిరిగి మళ్లీ టెస్టులకు పిలుపునివ్వాలి భారత సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా వెన్ను గాయం కారణంగా 2018 తర్వాత ఇప్పటి వరకూ హార్దిక్ పాండ్యా టెస్టు మ్యాచ్ ఆడలేదు.
"టెస్టులకు హార్దిక్ మాకు కచ్చితంగా మంచి ఎంపిక. కానీ తను ఫిట్‌గా ఉన్నాని, తిరిగి టెస్టుల్లో రీ ఎంట్రీ ఇస్తానని పాండ్యానే స్వయంగా ముందుకు రావల్సి ఉంటుంది. సెలక్టర్లు మాత్రం అతడిని రెడ్‌బాల్ క్రికెట్‌కు ఎంపిక చేయాలని ఆసక్తిగా ఉన్నారు. కానీ తుది నిర్ణయం మాత్రం పాండ్యానే తీసుకోవాల్సి ఉంటుంది. హార్దిక్ ఫిట్‌నెస్ టెస్టు క్రికెట్‌కు సరిపోతుందో లేదో తనకే తెలియాలి" ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నాడు.
చదవండి: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎవరి సాయం లేకుండా మెట్లెక్కేసిన పంత్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment