వెస్టిండీస్ టూర్‌లో టీమిండియా జైత్ర యాత్రకు బ్రేక్ పడింది. బార్బోడస్ వేదికగా విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 40.5 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌటైంది. ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, శుబ్‌మన్ గిల్ (49 బంతుల్లో 34; 5 ఫోర్లు) రాణించాడు.
విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్, గుడకేశ్ మోతీ తలా మూడో వికెట్లతో భారత జట్టును దెబ్బతీయగా..అల్జారి జోసెఫ్ రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ మ్యాచ్‌కు స్టార్ బ్యాటర్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మలకు విశ్రాంతి ఇచ్చారు. దీంతో హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు నాయకత్వం వహించాడు. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ హోప్ (63 నాటౌట్), కార్టీ(48) పరుగులతో రాణించారు. ఇక దారుణ పరాజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఈ మ్యాచ్‌లో తమ ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యమనేని హార్దిక్ అంగీకరించాడు.
"ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశపరించింది. మేము బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యాం. అయితే తొలి ఇన్నింగ్స్ తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలించింది. కానీ అది ప్రధాన సమస్య కాదు. మేము ఈ మ్యాచ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. మా ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా కిషన్ బ్యాటింగ్ తీరు నన్ను ఎంతో ఆకట్టుకుంది.
కిషన్ తన ఫామ్‌ను కొనసాగించడం భారత క్రికెట్ చాలా ముఖ్యం. ఇక బౌలింగ్‌లో ఠాకూర్ తన వంతు ప్రయత్నం చేశాడు. ఆరంభంలో రెండు వికెట్లు పడగొట్టి మా ఆశలను సజీవంగా నిలిపాడు. కానీ హోప్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను మా నుంచి లాగేసాడు. వరల్డ్‌కప్‌కు మేము సన్నద్దమవుతున్నాము కాబట్టి నేను కూడా మరిన్ని ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను.
మా ప్రపంచ సన్నహాకాలు అంతా సవ్యంగా సాగుతాయి అని ఆశిస్తున్నా. ఇది కుర్రాళ్లను పరీక్షించే సమయం. ఇక ప్రస్తుతం 1-1తో సిరీస్ సమమైంది. కాబట్టి ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంటామని అశిస్తున్నా" అని హార్దిక్ పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment