PC:IPL.com
ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో అదరగొట్టిన హార్దిక్ సేన.. 6వికెట్ల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించిన గుజరాత్.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు.
పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ మాట్లాడుతూ.. "నిజం చెప్పాలంటే మ్యాచ్ ఇంత దగ్గరగా వెళ్తుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఈ మ్యాచ్ నుంచి మేము నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఆటలో ఇటువంటివి సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఇక ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. జోషఫ్, మొహిత్ శర్మ మిడిల్‌ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
మొహాలీ వంటి డ్రైవికెట్ పై బౌలింగ్ చేయడం అంత సులభం కాదు. కానీ మొహిత్ చాలా కష్టపడి తన అనుభవం ఎంటో చూపించాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే గిల్ తన రిథమ్‌ను కొనసాగిస్తున్నాడు. మా బాయ్స్ మిడిల్ ఓవర్లలో కొన్ని రిస్క్ షాట్లు ఆడి పరుగులు రాబట్టారు. అయితే మ్యాచ్‌ను ముందే ఫినిష్ చేయాలి అనుకున్నాము. కానీ దురదృష్టవశాత్తూ మ్యాచ్ ఆఖరి వరకు వచ్చింది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ రావడం నాకు పెద్దగా నచ్చదు" అని పేర్కొన్నాడు.
చదవండి: కోహ్లి, బాబర్, సూర్య కాదు.. అతడే ప్రపంచ నెం1 ఆటగాడు!
Comments
Please login to add a commentAdd a comment