Ind Vs Aus: Virat Kohli Fumes As Hardik Pandya Ignores Him During 1st ODI, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IND Vs AUS: ఏంటి హార్దిక్‌ ఇది.. సీనియర్లకు ఇచ్చే విలువ ఇదేనా? పాపం కోహ్లి! వీడియో వైరల్‌

Published Sat, Mar 18 2023 12:16 PM | Last Updated on Sat, Mar 18 2023 12:54 PM

Virat Kohli Fumes As Hardik Pandya Ignores Him During 1st odi - Sakshi

PC: Twitter

ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో భారత స్టార్‌ ఆటగాళ్లు కేల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పట్ల హార్దిక్‌ పాండ్యా వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏం జరిగిందంటే?
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 20 ఓవర్లు ముగిసేసరికి 129 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి పటి‍ష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 21వ ఓవర్ బౌలింగ్ చేయడానికి కుల్దీప్‌ యాదవ్‌ వచ్చినప్పుడు..  విరాట్ కోహ్లీ ఫీల్డ్‌లో మార్పు చేయాలని హార్దిక్‌కు సూచించాడు.

అయితే హార్దిక్‌ మాత్రం విరాట్‌ మాటలను కొంచెం కూడా పట్టించుకోకుండా దూరంగా వెళ్లిపోయాడు. వెంటనే కోహ్లి కూడా హార్దిక్‌ను ఉద్దేశించి కోపంగా ఏదో అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా నిలిచిన కోహ్లిని.. హార్దిక్‌ ఈ విధంగా అవమానించడాన్ని విరాట్‌ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్‌ చేస్తున్నారు. ఎంత కెప్టెన్‌ అయినా, సీనియర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడుతున్నారు.
చదవండి: IND vs Aus: ఓడిపోయే మ్యాచ్‌ గెలిచాం.. వారిద్దరి వాళ్లే ఇదంతా! చాలా గర్వంగా ఉంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement