చెన్నై వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో 3 బంతులు ఎదుర్కొన్న స్మిత్.. డకౌట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఓ అద్భుతమైన బంతితో స్మిత్‌ను బోల్తా కొట్టించాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 12 ఓవర్‌లో హార్దిక్ పాండ్యా వేసిన ఆఫ్‌సైడ్ బంతిని స్మిత్ కవర్ డ్రైవ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.
అయితే బంతి ఔట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని నేరుగా వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. దీంతో చేసేదేమి లేక స్మిత్ తన బ్యాట్‌ను చూసుకుంటూ పెవిలియన్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో స్మిత్ ఓ అద్భుతమైన క్యాచ్‌తో హార్దిక్‌ను పెవిలియన్‌కు పంపాడు.
ఈ మ్యాచ్‌లో హార్దిక్ కూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇప్పుడు మూడో వన్డేలో స్మిత్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపిన హార్దిక్.. ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. కాగా వన్డేల్లో ఇప్పటివరకు హార్దిక్ పాండ్యా చేతిలో స్మిత్ ఔట్ కావడం ఇది ఐదో సారి. ఈ మ్యాచ్‌లో హార్దిక్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
8 ఓవర్లు బౌలింగ్ చేసిన పాండ్యా.. 44 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్(47), కారీ(38), హెడ్(33) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు సాధించగా..అక్షర్ పటేల్, సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
చదవండి: IND vs AUS: కుల్దీప్‌పై కోపంతో ఊగిపోయిన రోహిత్, కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్
Steve Smith registered his first duck in ODIs since Feb 2017.#INDvAUS pic.twitter.com/btiuBW1VUu
— CricTracker (@Cricketracker) March 22, 2023
Steve Smith vs Hardik Pandya
— Slayer (@pervy_slayer) March 22, 2023
Runs - 72
Dismissed - 5 times
Avg - 14.20#champion #WPL2023 #IPL2023 #ViratKohli #RohitSharma #MSDhoni #HardikPandya #PatnaJunction #INDvsAUS #75thCentury #PunjabPolice #BCCI pic.twitter.com/Yg2Y193oD1
.@hardikpandya7 picks up two quick wickets as Travis Head and Steve Smith depart.
— BCCI (@BCCI) March 22, 2023
Watch the two dismissals here 👇👇#INDvAUS @mastercardindia pic.twitter.com/65yyVrPR2f
Comments
Please login to add a commentAdd a comment