Steve Smith's Horrible DRS Call Has Virat Kohli In Splits, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IND vs AUS: పరువు పోగొట్టుకున్న స్మిత్.. నవ్వుకున్న విరాట్‌ కోహ్లి!వీడియో వైరల్‌

Published Thu, Mar 23 2023 11:36 AM | Last Updated on Thu, Mar 23 2023 11:45 AM

Steve Smiths Horrible DRS Call Has Virat Kohli In Splits - Sakshi

చెన్నై వేదికగా టీమిండియాతో జరిగిన మూడో వన్డేలో 21 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో స్మిత్‌ సేన సొంతం చేసుకుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భారత్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఓ చెత్త రివ్యూ తీసుకుని నవ్వులు పాలయ్యాడు.

అసలు ఏం జరిగిందంటే?
టీమిండియా ఇన్నింగ్స్‌  10వ ఓవర్‌లో ఆసీస్‌ బౌలర్‌ సీన్‌ అబాట్‌.. కోహ్లికి ఆఫ్-స్టంప్ వెలుపల బంతిని సంధించాడు. ఆ బంతిని కోహ్లి ఆఫ్‌సైడ్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్‌ అయ్యి నేరుగా వికెట్‌ కీపర్‌ చేతికి వెళ్లింది. దీంతో బౌలర్‌తో పాటు వికెట్‌ కీపర్‌ కారీ క్యాచ్‌ ఔట్‌కు అ‍ప్పీల్‌ చేశారు.

అయితే అంపైర్‌ నితిన్‌ మీనన్‌ మాత్రం నాటౌట్‌ అంటూ తల ఊపాడు. ఈ క్రమంలో ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ వికెట్‌కీపర్‌తో చర్చలు జరపి రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బ్యాట్‌కు బంతికి మధ్య భారీ గ్యాప్‌ ఉన్నట్లు తేలింది.

రీప్లే చూసిన వెంటనే విరాట్‌ కోహ్లి ఒక్కసారిగా నవ్వుకున్నాడు. కోహ్లితో పాటు ఆసీస్‌ బ్యాటర్‌ మార్నస్‌ లాబుషేన్‌ కూడా నవ్వుకున్నాడు. ఇక స్మిత్‌ అయితే రిప్లే చూశాక తెల్లముఖం వేసుకున్నాడు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


చదవండి: IND vs AUS: సూర్య కేవలం మూడు బాల్స్‌ మాత్రమే ఆడాడు! అంత మాత్రాన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement