ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అనంతరం భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిధ్య జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.ఈ సిరీస్‌లు జూలై-ఆగస్టులో జరగనున్నాయి. అయితే టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీకి భారత సెలెక్టర్లు విశ్రాంతినివ్వబోతున్నట్లు సమాచారం.
వీరి స్థానంలో ఐపీఎల్‌లో అదరగొట్టిన రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, జితేష్ శర్మ వంటి యవ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్‌లో సత్తాచాటిన వెటరన్ పేసర్ మొహిత్ శర్మ కూడా ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. అదే విధంగా హార్దిక్ డిప్యూటీగా సూర్యకుమార్ యాదవ్ ఉండనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో యువ క్రికెటర్లను తయారు చేసి పనిలో బీసీసీఐ పడింది.
చదవండి: WTC Final 2023: మాపై ఎలాంటి ఒత్తిడీ లేదు, ఒక వేళ ఓడినా: ద్రవిడ్
Comments
Please login to add a commentAdd a comment