India vs West ndies
-
విండీస్‌తో టీ20 సిరీస్.. కెప్టెన్‌గా హార్దిక్! విధ్వంసకర ఓపెనర్ ఎంట్రీ! రింకూ కూడా
ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అనంతరం భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిధ్య జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.ఈ సిరీస్‌లు జూలై-ఆగస్టులో జరగనున్నాయి. అయితే టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీకి భారత సెలెక్టర్లు విశ్రాంతినివ్వబోతున్నట్లు సమాచారం. వీరి స్థానంలో ఐపీఎల్లో అదరగొట్టిన రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, జితేష్ శర్మ వంటి యవ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్లో సత్తాచాటిన వెటరన్ పేసర్ మొహిత్ శర్మ కూడా ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. అదే విధంగా హార్దిక్ డిప్యూటీగా సూర్యకుమార్ యాదవ్ ఉండనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో యువ క్రికెటర్లను తయారు చేసి పనిలో బీసీసీఐ పడింది. చదవండి: WTC Final 2023: మాపై ఎలాంటి ఒత్తిడీ లేదు, ఒక వేళ ఓడినా: ద్రవిడ్ -
భారత యువ పేసర్ ఖలీల్‌కు మందలింపు
ముంబై: వెస్టిండీస్‌తో జరిగిన నాల్గో వన్డేలో అతిగా ప్రవర్తించిన టీమిండియా యువ పేసర్ ఖలీల్ అహ్మద్‌ను మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ మందలించారు. మార్లోన్ శామ్యూల్స్ వికెట్ తీసిన తర్వాత ఖలీల్ దూకుడుగా ప్రవర్తించాడు. వికెట్ తీసిన ఆనందంలో శామ్యూల్స్పైకి దూసుకెళ్లాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనలకు వ్యతిరేకం కావడంతో ఖలీల్‌ను మ్యాచ్ రిఫరీ హెచ్చరించారు. ఈ క్రమంలోనే అతనికి ఒక డిమెరిట్ పాయింట్‌ను విధించారు. ఐసీసీ లెవల్-1 నిబంధనల్లో భాగంగా ఆర్టికల్ 2.5 కోడ్‌ను ఖలీల్ ఉల్లఘించాడు. ఈ ఆర్టికల్ ప్రకారం ఒక ఆటగాడిని మరొక ఆటగాడు అసభ్యంగా దూషించడం కానీ చర్యల ద్వారా కవ్వించడం కానీ చేయకూడదు. దీన్ని ఖలీల్ అతిక్రమించడంతో అతను హెచ్చరికకు గురయ్యాడు. భారత్ నిర్దేశించిన 378 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా 14 ఓవర్ నాల్గోబంతికి శామ్యూల్స్ ఔటయ్యాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు స్లిప్ క్యాచ్ ఇచ్చి శామ్యూల్స్ ఔటయ్యాడు. ఈ క్రమంలోనే ఖలీల్ అతిగా ప్రవర్తించినట్లు ఫీల్డ్ అంపైర్లు ఇయాన్ గౌడ్, అనిల్ చౌదరిలు రిఫరీకి ఫిర్యాదు చేశారు. దాంతో ఖలీల్‌కు ఒక డెమెరిట్ పాయింట్ విధించిన రిఫరీ.. హెచ్చరికతో సరిపెట్టాడు. తన తప్పిదాన్ని ఖలీల్ ఒప్పుకోవడంతో దీనిపై ఎటువంటి తదుపరి విచారణ అవసరం లేదని రిఫరీ బ్రాడ్ తెలిపారు. విండీస్‌తో నాల్గో వన్డేలో ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేసిన ఖలీల్ అహ్మద్ 13 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 224 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
ఈ బుజ్జీ ధోనీ అప్పుడే ఫోన్ వాడేస్తోంది!
కెప్టెన్ ధోనీ- వైస్ కెప్టెన్ కోహ్లి జోడీ కలిసి ఆడితే ఎలా ఉంటుందో మనకు తెలుసు! ఈ జోడీ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. భారత జట్టును సెమీస్‌కు చేర్చింది. ఇప్పుడు కోహ్లి మాత్రం ధోనీతో కాకుండా బుజ్జీ ధోనీ జివాతో జట్టు కట్టాడు. తన ఫోన్ తీసి ఆ బుజ్జాయి చేతుల్లో పెట్టాడు. మరీ బుజ్జీ ధోనీ ఏం తక్కువ తిన్నదా? తనకు ఫోన్ గురించి ఏ టు జెడ్ తెలిసినట్టు ఏకంగా చెవి దగ్గర మొబైల్ పెట్టుకొని మాట్లాడినట్టు ఫోజు కూడా ఇచ్చింది. ఈ ఆడోరబుల్ సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ధోనీ గారాలపట్టి జివాతో విరాట్ కోహ్లి దిగిన ఈ సెల్ఫీకి 24 గంటల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 1.9 లక్షల లైకులు వచ్చాయి. 5వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. 'బుజ్జి జివాను చూడండి అప్పుడు నా ఫోన్‌తో ఆడుకుంటోంది. ఫోన్ ఎలా వాడాలో తెలిసినట్టు. ఎంత క్యూట్‌గా, ఆడోరబుల్గా ఉందో కదా. పిల్లలే అంతా. వాళ్లు పక్కన ఉంటే ప్రపంచాన్ని మరిచిపోయి.. వారి అమాయకపు కళ్లలో చూస్తూ ఉండవచ్చు. ఎంత బావుంటుందో' అంటూ జివాతో దిగిన సెల్ఫీని పోస్టు చేశాడు కోహ్లి. మరోవైపు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ద్వేన్ బ్రేవో కూడా కూతురిని ఎత్తుకున్న ధోనీ, బౌలర్ భజ్జీతో ఫొటో దిగి ట్విట్టర్లో షేర్ చేశాడు. It was great running into 2 of the greatest #Champions. Captain Kool @msdhoni and @harbhajan_singh.. #ChampionDance pic.twitter.com/fHXgQG5hmD — Dwayne DJ Bravo (@DJBravo47) 29 March 2016