హార్దిక్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది.. అది చూసి నేను షాకయ్యా: నితీష్‌ | SRH Star Reveals Hardik Pandyas Message During 2024 T20 World Cup | Sakshi
Sakshi News home page

హార్దిక్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది.. అది చూసి నేను షాకయ్యా: నితీష్‌

Published Thu, Jul 25 2024 4:53 PM | Last Updated on Thu, Jul 25 2024 5:25 PM

SRH Star Reveals Hardik Pandyas Message During 2024 T20 World Cup

ఆంధ్రా స్టార్ ఆల్‌రౌండ‌ర్‌, ఎస్ఆర్‌హెచ్ ఆట‌గాడు నితీష్ కుమార్ రెడ్డి తిరిగి మ‌ళ్లీ మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. ఐపీఎల్‌-2024 త‌ర్వాత స్పోర్ట్స్ హెర్నియా గాయం కారణంగా ఆట‌కు దూరంగా ఉంటున్న నితీష్ కుమార్‌.. సెప్టెంబ‌ర్ 9 నుంచి జ‌ర‌గ‌నున్న దులీప్ ట్రోఫీతో రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

కాగా ఈ ఏడాది ఐపీఎల్‌లో సీజ‌న్‌లో అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌డంతో నితీష్‌కు భార‌త జ‌ట్టు నుంచి తొలిసారి పిలుపువ‌చ్చింది. జింబాబ్వే సిరీస్‌కు నితీష్ కుమార్ సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు. కానీ దుర‌దృష్టవశాత్తు గాయం కారణంగా జింబాబ్వే పర్యటనకు నితీష్  దూరమయ్యాడు. 

అయితే తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్ భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ఇష్టమైన ఆల్‌రౌండర్లలో హార్దిక్ పాండ్యా ఒకడని, తనకు ఎంతో సపోర్ట్‌గా ఉన్నాడని నితీష్ చెప్పుకొచ్చాడు.

"టీ20 వరల్డ్‌కప్‌-2024 సన్నాహాకాల్లో బీజీగా ఉన్నప్పటకి హార్దిక్ భాయ్ నాకు ఓ మెసేజ్ చేశాడు. ఫీల్డ్‌లో నా ఎఫక్ట్‌, ఎనర్జీ,  ఆటతీరు తనను ఎంతగానో ఆకట్టుకున్నట్లు పాండ్యా ఆ మెసేజ్‌లో రాసుకొచ్చాడు. త్వరలోనే మనం కలిసి ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

నిజంగా అతడి మెసెజ్‌ను చూసి షాక్ అయ్యాను. ఎందకంటే ఓ మెగా టోర్నీకి సన్నద్దమవుతున్న సమయంలో కూడా నన్ను గుర్తుపెట్టుకోవడం నిజంగా చాలా గ్రేట్‌. వెంటనే పాండ్యా భయ్యాకు ధన్యవాదాలు తెలుపుతూ రిప్లే ఇచ్చాను.

అదే విధంగా ఓ ఆల్‌రౌండర్‌గా బెన్ స్టోక్స్‌, హార్దిక్ పాండ్యాలను నేను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్నానని" ఈఎస్పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2024లో 11 మ్యాచ్‌లు ఆడిన నితీష్ కుమార్‌.. 303 పరుగులతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్' అవార్డును సైతం ఈ ఆంధ్ర స్టార్‌ ఆల్‌రౌండర్‌ గెలుచుకున్నాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement