ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక మార్పులు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ముంబై ఫ్రాంచైజీ విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరి తమ జట్టు పగ్గాలను ముంబై మెనెజ్‌మెంట్ హార్దిక్‌కు అప్పగించింది. రోహిత్ శర్మ స్ధానంలో ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపపట్టిన హార్దిక్.. తన మార్క్‌ను చూపించలేకపోయాడు.
అతడి సారథ్యంలో దారుణ ప్రదర్శరన కనబరిచిన ముంబై కనీసం లీగ్ స్టేజిని కూడా దాటలేకపోయింది. ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది. ఆటగాడిగా కూడా పాండ్యా విఫలమయ్యాడు.
ఈ క్రమంలోనే అతడిని రిటైన్ చేసుకోకూడదని ముంబై నిర్ణయించుకున్నట్లు వినికిడి. అతడి స్ధానంలో సూర్యకుమార్ యాదవ్‌ను తమ జట్టు కెప్టెన్‌గా నియమించాలని ముంబై ఫ్రాంచైజీ యోచిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
సూర్యకుమార్ యాదవ్ ఇటీవలే భారత టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. హార్దిక్ పాండ్యాను కాదని రోహిత్ శర్మ వారసుడిగా సూర్యను బీసీసీఐ ఎంపిక చేసింది. శ్రీలంక టీ20 సిరీస్‌తో భారత జట్టు కెప్టెన్‌గా సూర్య తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లోనే సూర్య ఆకట్టుకున్నాడు. లంకతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 3-0 క్లీన్ స్వీప్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment