టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకున్న అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా హార్దిక్ నిలిచాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా.. టెన్నిస్ దిగ్గజాలు రఫెల్ నాదల్ (17 కోట్లు) రోజర్ ఫెదరర్ (11 కోట్లు), ప్రముఖ రేసర్ మాక్స్ వెర్స్టాపెన్(9.5), ఎర్లింగ్ హాలాండ్(24 కోట్లు)లను పాండ్యా అధిగమించాడు. 29 ఏళ్ల వయస్సులో హార్దిక్ ఈ ఘనత సాధించాడు.
కాగా హార్దిక్ సోషల్ మీడియాలో చాలా ఎక్టివ్‌గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో హార్దిక్ పంచుకుంటూనే ఉంటాడు. ఇటీవలే తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను హార్దిక్ షేర్ చేశాడు. అవి సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇక ఇన్‌స్టాలో 25 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను చేరుకోవడంపై హార్దిక్ స్పందించాడు. ఇక సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు హార్దిక్ కృతజ్ఞతలు తెలిపాడు.
"నాపై ప్రేమ చూపిస్తున్న అభిమానులందరికీ ధన్యవాదాలు. ప్రతీ ఒక్క అభిమాని నాకు చాలా ప్రత్యేకం. ఇన్నేళ్లుగా నాకు మద్దతుగా నిలిచిన నా ఫ్యాన్స్ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని ఇన్‌స్టాగ్రామ్‌లో హార్దిక్ పేర్కొన్నాడు. కాగా హార్దిక్ పాండ్యా ప్రస్తుతం బ్రేక్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ సిరీస్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా హార్దిక్ వ్యవహరించనున్నాడు.
చదవండి: ENG vs BAN: షకీబ్ ఆల్‌రౌండ్ షో.. ఇంగ్లండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్
Comments
Please login to add a commentAdd a comment