చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. తొలి జట్టుగా | Mumbai Indians becomes first team to play 250th IPL match | Sakshi
Sakshi News home page

IPL 2024: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. తొలి జట్టుగా

Published Mon, Apr 1 2024 9:22 PM | Last Updated on Tue, Apr 2 2024 10:19 AM

Mumbai Indians becomes first team to play 250th IPL match - Sakshi

ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు అరుదైన ఘ‌న‌త సాధించింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో 250 మ్యాచ్‌లు ఆడిన మొద‌టి జ‌ట్టుగా ముంబై రికార్డుల‌కెక్కింది. ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఈ అరుదైన ఫీట్ సాధించింది.

ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ముంబై తర్వాత అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్ధానంలో ఉంది. ఆర్సీబీ ఇప్పటివరకు 244 మ్యాచ్‌లు ఆడింది.

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్లు ఇవే..
ముంబై ఇండియన్స్ -250 మ్యాచ్‌లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- 244 మ్యాచ్‌లు
ఢిల్లీ క్యాపిటల్స్- 241 మ్యాచ్‌లు
కోల్‌కతా నైట్ రైడర్స్- 239 మ్యాచ్‌లు
పంజాబ్ కింగ్స్- 235 మ్యాచ్‌లు
చెన్నై సూపర్ కింగ్స్-  228 మ్యాచ్‌లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement