బుమ్రా(PC: IPL/ANI)
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లి అందరని షాక్‌కు గురిచేయగా.. ఇప్పుడు మరో భారత స్టార్ ఆటగాడు ఫ్రాంచైజీ మారనున్నట్లు తెగ వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ముంబై ఇండియన్స్‌లో హార్దిక్ పాండ్యా రావడం పట్ల బుమ్రా ఆసంతృప్తిగా ఉన్నాడని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే బుమ్రా ముంబై ఇండియన్స్ నుంచి గుజరాట్ టైటాన్స్‌లోకి వెళ్లనునున్నాడని తెలుస్తోంది. కాగా బుమ్రా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.
‘కొన్నిసార్లు నిశ్శబ్దమే అత్యుతమ సమాధానంగా నిలుస్తుంది’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో కూడా ముంబై ఇండియన్స్‌ను బుమ్రా అన్‌ఫాలో చేసినట్లు సమాచారం. దీంతో ఫ్రాంచైజీ మారాలని అతడు ఫిక్స్ అయిపోయినట్లు అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా 2013లో ముంబై ఇండియన్స్ తరపున బుమ్రా ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 9 సీజన్ల పాటు ముంబైకి ప్రాతినిథ్యం వహించాడు. గాయం కారణంగా బుమ్రా గత సీజన్‌కు దూరమయ్యాడు.
చదవండి: ఇదేమి బుద్దిరా బాబు.. ఔటైనా గ్రౌండ్‌లో నుంచి వెళ్లలేదు! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment