
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ మరో ఓటమి చవిచూసింది. తమ సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముంబై పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌లో తేలిపోయిన ముంబై.. అనంతరం బ్యాటింగ్‌లోనూ రోహిత్ శర్మ మినహా(103నాటౌట్) మిగితా బ్యాటర్లంతా బ్యాట్‌లత్తేశారు.
207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితమైంది. సీఎస్‌కే బౌలర్లలో పతిరాన అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. తన 4 ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ ఓటమిపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు.
"హోం గ్రౌండ్‌లో ఓడిపోవడం మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. 207 టార్గెట్ అనేది కచ్చితంగా చేధించగల్గే లక్ష్యమే. కానీ చెన్నై బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా పతిరనా తన బౌలింగ్‌తో మా ఓటమిని శాసించాడు. సీఎస్‌కే వారు ప్రణాళికలను సరిగ్గా అమలు చేశారు. వికెట్ల వెనక ధోని ఉన్నాడు.
తన విలువైన సూచనలు ఎప్పటికప్పుడు తన జట్టుకే ఇస్తూనే ఉన్నాడు. ధోని లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులో ఉంటే 100 శాతం కలిసిస్తోంది. పిచ్ బ్యాటింగ్‌కు కొంచెం కష్టంగా ఉంది. కానీ ఈ వికెట్‌పై మేము పాజిటివ్ బ్యాటింగ్ చేయాలకున్నాం. అందుకే తగ్గట్టు గానే మా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాం. కానీ పతిరాన బౌలింగ్ ఎటాక్‌లోకి వచ్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అక్కడే మా రిథమ్‌ను మేము కోల్పోయాం.
ఇది మేము అస్సలు ఊహించలేదు. ఇక దూబే స్పిన్నర్ల కంటే సీమర్‌లను ఎదుర్కోవడానికి కాస్త ఇబ్బంది పడతున్నందన నేను బౌలింగ్ చేయాల్సి వచ్చింది. మా రాబోయే మ్యాచ్‌లపై దృష్టిసారించి.. భారీ విజయాలను నమోదు చేసేందుకు ప్రయత్నిస్తామని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పేర్కొన్నాడు.