టీ20 వరల్డ్‌కప్-2024లో భాగమయ్యే భారత జట్టును బీసీసీ సెలక్షన్ కమిటీ మరో నాలుగు, ఐదు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ టోర్నీలో భాగమయ్యే ఆ జట్లు తమ వివరాలను మే 1లోపు ఐసీసీకి సమర్పించాల్సి ఉంది. దీంతో భారత జట్టును ఎంపిక చేసే పనిలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పడింది.
ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు టీ20 వరల్డ్‌కప్ కోసం బారత జట్టును అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా టీమిండియా మాజీ స్సిన్నర్ హార్భజన్ సింగ్ చేరాడు. టీ20 ప్రపంచకప్ కోసం తన 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును భజ్జీ ఎంపిక చేశాడు. ఈ జట్టులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, ఓపెనర్ శుబ్‌మన్ గిల్, పేసర్ మహ్మద్ సిరాజ్‌లకు భజ్జీ ఛాన్స్ ఇవ్వలేదు.
వీరితో పాటు స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌ను సైతం హార్భజన్ ఎంపిక చేయలేదు. అయితే అనూహ్యంగా ఈ జట్టులో భజ్జీ పేసర్ అవేష్ ఖాన్‌కు చోటివ్వడం గమనార్హం. ప్రస్తుత ఐపీఎల్‌లో సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అవేష్ ఖాన్ డెత్ ఓవర్లలో తన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే హార్భజన్ అవేష్‌కు చోటిచ్చాడు. ఇక భజ్జీ ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్‌లో అదరగొడుతున్న మయాంక్ యాదవ్, శివమ్ దూబే, యశస్వీ జైశ్వాల్‌కు చోటు దక్కింది. వికెట్ కీపర్ బ్యాటర్‌గా రిషబ్ పంత్‌ను హార్భజన్ ఎంచుకున్నాడు.అదేవిధంగా స్పెషలిస్టు స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్‌ను హార్భజన్ ఎంపిక చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2024 కోసం హర్భజన్ సింగ్ భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకు సింగ్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, మయాంక్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment