IPL 2023: Gujarat Titans vs Sunrisers Hyderabad Live Updates and Highlights - Sakshi
Sakshi News home page

IPL 2023 GT vs SRH: ఎస్‌ఆర్‌హెచ్‌పై ఘన విజయం.. ప్లేఆఫ్స్‌కు గుజరాత్‌

Published Mon, May 15 2023 6:52 PM | Last Updated on Mon, May 15 2023 11:27 PM

IPL 2023: Gujarat Titans vs Sunrisers Hyderabad Live Updates and Highligts - Sakshi

ఎస్‌ఆర్‌హెచ్‌పై ఘన విజయం.. ప్లేఆఫ్స్‌కు గుజరాత్‌
ఐపీఎల్‌-2023లో ప్లేఆఫ్‌ రేసు నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అధికారికంగా నిష్క్రమించింది. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్‌ ఓటమి పాలైంది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ 150 పరుగులకు ఆలౌటైంది.

ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో హెన్రిచ్‌ క్లాసెన్‌(64) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. గుజరాత్‌ బౌలర్లలో షమీ, మొహిత్‌ శర్మ చెరో నాలుగు వికెట్లతో సన్‌రైజర్స్‌ను దెబ్బతీయగా.. యష్‌ దయాల్‌ ఒక్క వికెట్‌ సాధించాడు. అదే విధంగా ఈ ఏడాది సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా గుజరాత్‌ నిలిచింది.
13 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 97/7
13 ఓవర్లు ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్‌ 13 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 97 పరుగులుచేసింది. క్లాసెన్‌(48), భువనేశ్వర్‌ కుమార్‌(11) పరుగులతో ఉన్నారు.

50 పరుగులకే 6 వికెట్లు
ఎస్‌ఆర్‌హెచ్‌ వరుస క్రమంలో వికెట్లు కోల్పోతోంది. కేవలం 50 పరుగులకే 6 వికెట్లు నష్టపోయింది. మొహిత్‌ శర్మ బౌలింగ్‌లో సన్విర్‌ సింగ్‌, అబ్దుల్‌ సమద్‌ పెవిలియన్‌కు చేరారు.

29 పరుగులకే 4 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ 
189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ కేవలం 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మార్‌క్రమ్‌ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో మార్‌క్రమ్‌(10) ఔటయ్యాడు.

4 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 29/3
4 ఓవ‍ర్లు ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్‌ మూడు వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. క్రీజులో మార్‌క్రమ్‌(10), క్లాసెన్‌(7) పరుగులతో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
అభిషేక్‌ శర్మ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన అభిషేక్‌.. యశ్‌దయాల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌..
189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన అన్మోల్‌ప్రీత్ సింగ్.. షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

సెంచరీతో చెలరేగిన గిల్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ టార్గెట్‌ 189
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్‌ గిల్‌(58 బంతుల్లో 101) సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు సాయిసుదర్శన్‌(47) పరుగులతో రాణించాడు. కాగా ఓ దశలో గుజరాత్‌ స్కోర్‌ బోర్డు 200 పరుగులు ఈజీగా దాటుతుందని అంతా భావించారు.

కానీ డెత్‌ ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు అద్భుతమైన కమ్‌ బ్యాక్‌ ఇచ్చారు. ముఖ్యంగా భువనేశ్వర్‌ కుమార్‌ మరోసారి తన అనుభవాన్ని కనబరిచాడు. ఆఖరి ఓవర్‌ వేసిన భువీ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు సాధించాడు.

సెంచరీతో చెలరేగిన గిల్‌
ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజకాత్‌ టైటాన్స్‌ స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం  56 బంతుల్లోనే గిల్‌ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 13 ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. కాగా గిల్‌కు ఇదే తొలి ఐపీఎల్‌ సెంచరీ. 19 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 186/5

నాలుగో వికెట్‌ డౌన్‌
గుజరాత్‌ టైటాన్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. నటరాజన్‌ బౌలింగ్‌లో 7 పరుగులు చేసిన డెవిడ్‌ మిల్లర్‌  పెవిలియన్‌కు చేరాడు. 17 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 171/4

మూడో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌..
గుజరాత్‌ టైటాన్స్‌ మరో వికెట్‌ కోల్పోయింది. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(8) పెవిలియన్‌కు చేరాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎట్టకేలకు వికెట్‌ సాధించింది. 47 పరుగులు చేసిన సాయిసుదర్శన్‌.. జానెసన్‌ బౌలింగ్‌లో నటరాజన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 147 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 15 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ స్కోర్‌: 154/2

12 ఓవర్లకు గుజరాత్‌ టైటాన్స్‌ స్కోర్‌: 131/1
12 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ టైటాన్స్‌ వికెట్‌ నష్టానికి 131 పరుగులు చేసింది. క్రీజులో గిల్‌(77), సాయి సుదర్శన్‌(43) పరుగులతో ఉన్నారు.
8 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 89/1
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ దూకుడుగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 89 పరుగులు చేసింది. శుబ్‌మాన్‌ గిల్‌ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 22 బంతుల్లో గిల్‌ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడితో పాటు క్రీజులో సాయిసుదర్శన్‌(23) పరుగులతో ఉన్నాడు.

6 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 65/1
ఆరు ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ టైటాన్స్‌ వికెట్‌ నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజులో గిల్‌(36), సాయిసుదర్శన్‌(21) పరుగులతో ఉన్నారు.
3 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 32/1
మూడు ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ టైటాన్స్‌ వికెట్‌ నష్టానికి 32 పరుగులు చేసింది. క్రీజులో గిల్‌(10), సాయిసుదర్శన్‌(14) పరుగులతో ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహా డకౌట్‌గా వెనుదిరగాడు.

ఐపీఎల్‌-2023 సీజన్‌ లీగ్‌ మ్యాచ్‌లు చివరి దశకు చేరాయి. ఈ క్యాష్‌ రిచ్‌లో లీగ్‌లో భాగంగా సోమవారం ఆహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఇక శ్రీలంక కెప్టెన్‌ దసున్‌ షనక గుజరాత్‌ టైటాన్స్‌ తరపున ఐపీఎల్‌ అరంగేట్రం చేయనున్నాడు.

తుది జట్లు:
 
సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌ కీపర్‌), అబ్దుల్ సమద్, సన్విర్ సింగ్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూకీ, టి నటరాజన్

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్‌), శుభమాన్ గిల్, బి సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, దసున్ షనక, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement