టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రెడ్ బాల్ క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరగనున్న రంజీ ట్రోఫీ సీజన్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లో పాండ్యా పునరాగమనం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా పాండ్యా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. నెట్స్‌లో రెడ్ బాల్‌తో బౌలింగ్ చేస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో పోస్ట్ చేశాడు.
దీంతో అతడు మళ్లీ భారత టెస్టు జట్టులోకి కమ్‌బ్యాక్ ఇవ్వనున్నాడని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అక్టోబర్‌లో ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో బరోడాకు హార్దిక్ ప్రాతినిథ్యం వహించే అవకాశముంది.
చివరి టెస్టు ఎప్పుడు ఆడడంటే?
హార్దిక్ పాండ్యా 2018లో తన చివరి టెస్ట్ మ్యాచ్ భారత్ తరుపన ఆడాడు. అప్పటి నుంచి టీమిండియాకే కాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఫిట్‌నెస్ లేమి కారణంగా పాండ్యా కేవలం వైట్-బాల్ క్రికెట్‌పై మాత్రమే దృష్టి సారించాడు. గత ఆరేళ్లగా అతడిని గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి.
మధ్యలో ఓసారి పాండ్యా వెన్నుముక సర్జరీ కూడా చేసుకున్నాడు. ఈ కారణాలతో అతడు రెడ్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. అయితే పాండ్యా ప్రస్తుతం గతంతో పోలిస్తే ఫిట్‌నెస్ పరంగా మెరుగయ్యాడు. దీంతో అతడు టెస్టుల్లో రీ ఎంట్రీ దిశగా అడుగులు వేస్తున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత పాండ్యా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడు తిరిగి మళ్లీ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో భారత జట్టులోకి రానున్నాడు.
చదవండి: పాకిస్తాన్‌లోనే చాంపియన్స్ ట్రోఫీ: ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్
Comments
Please login to add a commentAdd a comment