
అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో 168 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1లో హార్దిక్ సేన సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కివీస్ ముందు 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
భారత బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్(126 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు. అనంతరం 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 66 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు, ఉమ్రాన్, అర్ష్‌దీప్, మావి తలా రెండు వికెట్లు సాధించారు.
చరిత్ర సృష్టించిన టీమిండియా..
కివీస్‌పై 168 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. టీ20ల్లో సరి కొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో పరుగుల తేడా పరంగా భారత్‌కిదే అతిపెద్ద విజయం. అంతకుముందు 2018లో ఐర్లాండ్‌పై 143 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది.
214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 70 పరుగులకు ఆలౌటైంది. ఇక టీ20ల్లో 100కు పైగా పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించడం ఇది మూడో సారి కావడం గమానార్హం.
చదవండి: IND vs NZ: గంటకు 150 కి.మీ. వేగం.. సర్కిల్ బయటపడ్డ బెయిల్స్! ఉమ్రాన్‌తో అట్లుంటది మరి
Comments
Please login to add a commentAdd a comment