PC:IPL.com
ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలూండగానే లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్(67) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అతడితో పాటు తెవాటియా(2 బంతుల్లో5) కీలక సమయంలో ఫోర్ బాది గుజరాత్‌కు విజయాన్ని అందించాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ బ్యాటర్లలో షార్ట్ 36 పరుగులతో రాణించాడు. గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ రెండు వికెట్లు, షమీ, లిటల్, జోషఫ్,రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు.
వరుసగా విఫలమవుతున్న హార్దిక్
ఇక గుజరాత్ టైటాన్స్ విజయాలు సాధిస్తున్నప్పటికీ.. ఆజట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు. గతేడాది సీజన్‌లో అద్భుతంగా రాణించిన హార్దిక్.. ఈ సీజన్‌లో మాత్రం బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పాండ్య.. 11 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.
ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన అతడు 21 పరుగులు మాత్రమే చేశాడు. ఇక దారుణ ప్రదర్శన కనబరుస్తున్న హార్దిక్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. అదృష్టం బాగుంది కాబట్టి గెలుస్తున్నావు.. నీ చెత్త బ్యాటింగ్‌తో కాదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి కొంత మంది మరి కొంత మంది కెప్టెన్‌గా ఇదేనా నీ ఆట? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
చదవండి: Mohit Sharma: మూడేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన ధోని నమ్మిన బౌలర్
Wannabe captain cool, the beast all-rounder who doesn't bowl is in sublime form with the bat these days,
— TukTuk Academy (@TukTuk_Academy) April 13, 2023
Hardik Pandya visited the academy with his masterclass inning of 8(11) alongwith newbie Sai Sudharsan ❤️ #PBKSvGT pic.twitter.com/OCIUEdJwuA
Comments
Please login to add a commentAdd a comment