ఐపీఎల్-2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 178 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు విఫలమయ్యారు. దీంతో ఈ ఏడాది సీజన్‌లో హార్దిక్ సేన రెండో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ సీనియర్ పేసర్ మహ్మద్ షమీపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా సీరియస్ అయ్యాడు.
ఏం జరిగిందంటే?
రాజస్తాన్ రాయల్స్ విజయానికి 12 బంతుల్లో 23 పరుగులు కావల్సిన నేపథ్యంలో బంతిని హార్దిక్ షమీ చేతికి ఇచ్చాడు. అయితే తొలి మూడు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన షమీ.. తన ఆఖరి ఓవర్‌లో మాత్రం విఫలమయ్యాడు. 19 ఓవర్‌లో షమీ తన వేసిన తొలి బంతినే దృవ్ జురెల్ స్టాండ్స్‌కు తరలించాడు. ఆ తర్వాతి బంతికే జురెల్ భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్‌ను కోల్పోయాడు.
అనంతరం క్రీజులోకి అశ్విన్ తాను ఎదుర్కొన్న ఫస్ట్ బంతిని ఫోర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బాల్‌ను డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టాడు. ఈ క్ర,మంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న పాండ్యా.. షమీపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 19 ఓవర్‌లో షమీ రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ.. ఏకంగా 16 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో మ్యాచ్ రాజస్తాన్‌కు మరింత చేరువైంది. కాగా హార్దిక్ ప్రవర్తనను నెటిజన్లు తప్పుబడుతున్నారు. హార్దిక్‌కు ఇది ఏమి కొత్త కాదు.. సీనియర్లకు విలువ ఇవ్వడం రాదంటూ దారుణంగా ట్రోలు చేస్తున్నారు.
చదవండి: RCB VS CSK: భారీ రికార్డులపై కన్నేసిన ధోని, కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment