
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కథ ఏ మాత్రం మారలేదు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ముంబై వరుసగా మూడో ఓటమి చవిచూసింది. తమ సొంత గ్రౌండ్ వాంఖడేలో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై పరాజయం పాలైంది.
బ్యాటింగ్ పరంగా ముంబై దారుణంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రాజస్తాన్ బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. రాజస్తాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, స్పిన్నర్ చాహల్ చెరో మూడు వికెట్లలో ముంబైని దెబ్బతీయగా.. బర్గర్ రెండు, అవేష్ ఖాన్ ఒక్క వికెట్ సాధించారు.
అనంతరం 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లలో రియాన్ పరాగ్(54 నాటౌట్) మరోసారి అదరగొట్టాడు.
ఇక వరుసగా మూడో ఓటమిపై ఈ మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్‌లో తాము అనుకున్నవిధంగా రాణించలేకపోయామని పాండ్యా తెలిపాడు.
"ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం చాలా బాధగా ఉంది. తొలుత మాకు మంచి ఆరంభం లభించలేదు. కానీ నేను బ్యాటింగ్ వచ్చాక ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడి చేయాలనుకున్నాను. నేను తిలక్ క్రీజులో ఉన్నప్పుడు మా స్కోర్ 150 నుంచి 160 పరుగులకు చేరుతుందని భావించాను. కానీ నేను ఔటయ్యాక రాజస్తాన్ తిరిగి మళ్లీ గేమ్‌లోకి వచ్చింది.
నేను మరో కొన్ని ఓవర్ల పాటు క్రీజులో ఉండాల్సింది. ఇక ఈ రోజు వాంఖడే వికెట్ మేము ఊహించిన దానికంటే భిన్నంగా ఉంది. ఓ ఓటమి ఇది నేను సాకుగా చెప్పాలనకోవడం లేదు. ఎందుకంటే ఒక బ్యాటర్‌గా ఎటువంటి వికెట్‌పైనైనా ఆడటానికి సిద్దంగా ఉండాలి. ఏదమైనప్పటికి ప్రత్యర్ధి బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు.
మేము అనుకున్న విధంగా ఫలితాలు రావడం లేదు. కానీ ఒక టీమ్‌గా మాపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇటువంటి సమయంలోనే ఎక్కువ ధైర్యంలో ముందుకు వెళ్లాలి. తర్వాతి మ్యాచ్‌ల్లో మేము తిరిగి కమ్‌బ్యాక్ ఇస్తామని" హార్దిక్ పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment