
IPL 2024 MI vs RR Live updates:
ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన రాజస్తాన్..
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడో ఓటమి చవి చూసింది. వాంఖడే వేదికగా రాస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 9 వికెట్లు కోల్పోయి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, చాహల్ తలా 3 వికెట్లు పడగొట్టగా.. బర్గర్ రెండు, అవేష్ ఖాన్ ఒక్క వికెట్ సాధించారు.
ముంబై బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లలో రియాన్ పరాగ్(54 నాటౌట్) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
నాలుగో వికెట్ డౌన్.. అశ్విన్ ఔట్
అశ్విన్ రూపంలో రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 14 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్ : 101/4
12 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్ : 87/3
12 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 3 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసిది. క్రీజులో పరాగ్(23), అశ్విన్(16) పరుగులతో ఉన్నారు. రాజస్తాన్ విజయానికి 48 బంతుల్లో 39 పరుగులు కావాలి.
మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్.. బట్లర్ ఔట్
48 పరుగుల వద్ద రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన బట్లర్.. మధ్వాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్ : 50/3
రెండో వికెట్ డౌన్.. సంజూ శాంసన్ ఔట్
42 పరుగుల వద్ద రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన కెప్టెన్ సంజూ శాంసన్.. ఆకాష్ మధ్వాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లు రాజస్తాన్ స్కోర్ : 44/1
4 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్ : 41/1
4 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. క్రీజులో సంజూ శాంసన్(12), జోస్ బట్లర్(10) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్..
126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన యశస్వీ జైశ్వాల్.. మఫాక బౌలింగ్‌లో ఔటయ్యాడు.
చెలరేగిన బౌల్ట్, చాహల్.. రాజస్తాన్ టార్గెట్ 126 పరుగులు
వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. రాజస్తాన్ బౌలర్ల దాటికి ముంబై కేవలం 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, చాహల్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. బర్గర్ రెండు, అవేష్ ఖాన్ ఒక్క వికెట్ సాధించారు. ముంబై బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
తొమ్మిదో వికెట్ డౌన్.. టిమ్ డేవిడ్ ఔట్
టిమ్ డేవిడ్ రూపంలో ముంబై తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన డేవిడ్.. బర్గర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 19 ఓవర్లకు ముంబై స్కోర్: 115/9
15 ఓవర్లకు ముంబై స్కోర్: 102/7
15 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. క్రీజులో టిమ్ డేవిడ్(10), కోయిట్జీ(3) పరుగులతో ఉన్నారు.
ఆరో వికెట్ డౌన్.. చావ్లా ఔట్
83 పరుగుల వద్ద ముంబై ఆరో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన పీయూష్ చావ్లా.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో తిలక్ వర్మ(32), టిమ్ డేవిడ్(6) పరుగులతో ఉన్నారు.
ఐదో వికెట్ డౌన్.. హార్దిక్ ఔట్
76 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. చాహాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి పీయూష్ చావ్లా వచ్చాడు.
6 ఓవర్లకు ముంబై స్కోర్: 46/4
6 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా(16), తిలక్ వర్మ(12) ఉన్నారు.
నిప్పులు చేరుగుతున్న బౌల్ట్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ట్రెంట్ బౌల్ట్ చుక్కలు చూపిస్తున్నాడు. బౌల్ట్ దెబ్బకు ముంబై వరుస క్రమంలో 3 వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ట్రెంట్ బౌల్ట్ చుక్కలు చూపిస్తున్నాడు.
బౌల్ట్ దెబ్బకు ముంబై వరుస క్రమంలో 3 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, నమాన్ ధార్, బ్రెవిస్ ఖాతా తెరవకుండానే పెవిలయన్‌కు చేరారు. ముంబై 3 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది.
తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(0) ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో ముంబై ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. రాజస్తాన్ మాత్రం ఒకే ఒక మార్పు చేసింది. సందీప్ శర్మ స్దానంలో నండ్రీ బర్గర్ తుది జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు
ముంబై ఇండియన్స్ : ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, జస్ప్రీత్ బుమ్రా, క్వేనా మఫాకా
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాండ్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్
Comments
Please login to add a commentAdd a comment