Zimbabwe Vs West Indies, 1st Test: Zimbabwe Vs West Indies 1st Test Draw - Sakshi
Sakshi News home page

Zim Vs WI 1st Test: జింబాబ్వే- వెస్టిండీస్‌టెస్టు ‘డ్రా’.. విండీస్‌ ఓపెనర్ల అరుదైన ఘనత

Published Thu, Feb 9 2023 7:55 AM | Last Updated on Thu, Feb 9 2023 9:22 AM

Zimbabwe vs West Indies Test Series 2023 1st Test Drawn - Sakshi

Zimbabwe vs West Indies, 1st Test- బులవాయో: వెస్టిండీస్, జింబాబ్వే మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. మ్యాచ్‌ చివరిరోజు వెస్టిండీస్‌ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 54 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసింది.


అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన విండీస్‌ 5 వికెట్లకు 203 పరుగులవద్ద డిక్లేర్‌ చేసింది. బ్రాత్‌వైట్‌ (25; 3 ఫోర్లు), తేజ్‌నరైన్‌ (15) టెస్టు మ్యాచ్‌లో వరుసగా ఐదు రోజులు ఆడిన తొలి ఓపెనింగ్‌ జోడీగా గుర్తింపు పొందింది. ఇక ఈ మ్యాచ్‌లో అజేయ డబుల్‌ సెంచరీ(207)తో మెరిసిన తేజ్‌నరైన్‌ చందర్‌పాల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.


జింబాబ్వే వర్సెస్‌ వెస్టిండీస్‌ తొలి టెస్టు 2023 మ్యాచ్‌ స్కోర్లు
వెస్టిండీస్‌- 447/6 డిక్లేర్డ్‌ & 203/5 డిక్లేర్డ్‌
జింబాబ్వే- 379/9 డిక్లేర్డ్‌ & 134/6
చదవండి: Gary Ballance: రెండు దేశాల తరఫున సెంచరీలు.. ఎన్నో ఆసక్తికర విశేషాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement