Gary Ballance
-
'రెండు' దేశాల క్రికెటర్ రిటైర్మెంట్.. బ్రాడ్‌మన్‌తో పోల్చిన వైనం
జింబాబ్వే క్రికెటర్ గ్యారీ బ్యాలెన్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా రెండు దేశాల తరపున ప్రాతినిధ్యం వహించిన అతి కొద్ది మంది క్రికెటర్లలో గ్యారీ బ్యాలెన్స్ ఒకడు. గ్యారీ బ్యాలెన్స్ మొదట ఇంగ్లండ్ జట్టుకు ఆడాడు. 2014 నుంచి 2017 వరకు ఇంగ్లండ్ తరపున 23 టెస్టులాడిన బ్యాలెన్స్.. ఆ తర్వాత జాతి వివక్షకు గురయ్యానంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) అతన్ని సస్పెండ్ చేసింది. దీంతో బ్యాలెన్స్ ఇంగ్లండ్ క్రికెట్‌ను వదిలి తాను పుట్టిన జింబాబ్వేకు వచ్చేశాడు. 2022లో జింబాబ్వే తరపున తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఓవరాల్‌గా గ్యారీ బ్యాలెన్స్ తన కెరీర్లో 24 టెస్టులాడి 1653 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు, ఏడు అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక 21 వన్డేల్లో 454 పరుగులు చేసిన బ్యాలెన్స్ ఖాతాలో మూడు వన్డే అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్టు క్రికెట్లో పెను సంచలనం.. ఘనమైన ఆరంభం గ్యారీ బ్యాలెన్స్ అంతర్జాతీయ అరంగేట్రం అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఇంగ్లండ్ తరపున 2014లో తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. తొలి 10 టెస్టులు కలిపి 67.93 సగటుతో 1017 పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్లో ఒక రకంగా ఇది రికార్డు అని చెప్పొచ్చు. దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాత తొలి పది టెస్టుల్లో 60కి పైగా సగటుతో వెయ్యి పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా గ్యారీ బ్యాలెన్స్ చరిత్రకెక్కాడు. నిజంగా ఏ క్రికెటర్‌కు అయినా ఇది మంచి ఆరంభం అని చెప్పొచ్చు. కానీ బ్యాలెన్స్ ఇదే ప్రదర్శనను తర్వాత కంటిన్యూ చేయలేకపోయాడు. తర్వాతి 13 టెస్టుల్లో రెండు అర్థసెంచరీలు మాత్రమే నమోదు చేసిన బ్యాలెన్స్ 19.04 సగటుతో కేవలం 481 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ క్రికెట్ నుంచి సస్పెండ్.. జింబాబ్వే తరపున అరంగేట్రం కెరీర్లో పీక్ దశలో ఉన్న సమయంలోనే గ్యారీ బ్యాలెన్స్ జాతి వివక్షపై చేసిన వ్యాఖ్యలు అతన్ని సస్పెండ్ అయ్యేలా చేశాయి. కౌంటీల్లో యార్క్‌షైర్ తరపున ఆడుతున్న బ్యాలెన్స్ .. తోటి క్రికెటర్ అజామ్ రఫీక్ ఎదుర్కొన్న వివక్షను మీడియా ముందు బయటపెట్టాడు. యార్క్‌షైర్‌లో జాతి వివక్ష మాట నిజమేనని.. ఇదంతా చూస్తూ కూడా ఈసీబీ ఏం పట్టనట్లుగా ఉందని.. పైగా తాను కూడా ఒక సందర్భంలో జాతి వివక్షకు గురయ్యానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈసీబీ బ్యాలెన్స్‌ను ఇంగ్లండ్ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత గ్యారీ బ్యాలెన్స్ తాను పుట్టిన జింబాబ్వేకు వెళ్లిపోయాడు. జింబాబ్వే క్రికెట్‌తో రెండేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్న గ్యారీ బ్యాలెన్స్ 2022 డిసెంబర్లో తిరిగి జింబాబ్వే తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే నాలుగు నెలల్లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. చదవండి: BCCI: 'భారత క్రికెట్ జట్లను చైనాకు పంపించలేం' -
స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. నాలుగు నెలలకే క్రికెట్‌కు గుడ్‌బై! షాక్‌లో ఫ్యాన్స్
జింబాబ్వే స్టార్ క్రికెటర్ గ్యారీ బ్యాలెన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు బ్యాలెన్స్ బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా జింబాబ్వే జట్టులో చేరిన నాలుగు నెలలకే బ్యాలెన్స్ రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. గ్యారీ అంతకుమందు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 42 మ్యాచ్‌లు ఆడాడు. 2014 నుంచి 2017 మధ్య ఇంగ్లండ్ తరపున 23 టెస్టులు ఆడాడు. ఆ తర్వాత అతడు ఫామ్ కోల్పోవడంతో 2017లో జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. అయితే ఆ తర్వాత గతేడాది డిసెంబర్లో తన సొంత దేశం తరపున ఆడేందుకు జింబాబ్వే క్రికెట్‌తో రెండేళ్ల ఒప్పందం కుదర్చుకున్నాడు. జింబాబ్వే తరపున తన అరంగేట్ర టెస్టులోనే సెంచరీతో చెలరేగాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌పై బ్యాలెన్స్ సెంచరీ సాధించాడు. 33 ఏళ్ల గ్యారీ ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 137 పరుగులు చేశాడు. అద్భుతఫామ్‌లో ఉన్న అతడు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఇకపై తన కుటుంబంతో గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాలెన్స్ పేర్కొన్నాడు. అదే విధంగా ఈ నాలుగు నెలలపాటు తనకు మద్దతుగా నిలిచిన జింబాబ్వే క్రికెట్ ధన్యవాదాలు తెలిపాడు. చదవండి: IPL 2023: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. ప్రతీ మ్యాచ్‌లో ఇంతే! తీసి పడేయండి.. -
విండీస్ బౌలర్ ధాటికి విలవిలలాడిన జింబాబ్వే
Gudakesh Motie: వెస్టిండీస్ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ ధాటికి జింబాబ్వే విలవిలలాడింది. 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా విండీస్‌తో ఇవాళ (ఫిబ్రవరి 12) మొదలైన రెండో టెస్ట్‌లో మోటీ 7 వికెట్లతో విజృంభించడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగులకే కుప్పకూలింది. మోటీతో పాటు జేసన్ హోల్డర్ (2/18), అల్జరీ జోసఫ్ (1/29) రాణించడంతో జింబాబ్వే స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఇన్నోసెంట్ కాలా (38) టాప్ స్కోర్‌గా నిలిచాడు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కాలాతో పాటు చిబాబ (10), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (22), ట్రిపానో (23 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. రేమన్ రీఫర్ (53) అర్ధసెంచరీతో రాణించగా.. తేజ్‌నరైన్ చంద్రపాల్ (36), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (22) ఓ మోస్తరుగా రాణించారు. కైల్ మేయర్స్ (8), రోస్టన్ చేజ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో బ్రెండన్ మవుటా 2 వికెట్లు పడగొట్టగా.. మసకద్జకు ఓ వికెట్ దక్కంది. రీఫర్ రనౌటయ్యాడు. కాగా, తొలి టెస్ట్ సెంచరీ హీరో, జింబాబ్వే ఆటగాడు గ్యారీ బ్యాలెన్స్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కకపోవడం విశేషం. 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో బ్యాలెన్స్‌తో పాటు విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ సెంచరీలు చేయగా.. శివ్‌నరైన్ చంద్రపాల్ కొడుకు తేజ్‌నరైన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. -
Zim Vs WI: జింబాబ్వే- వెస్టిండీస్ టెస్టు ‘డ్రా’.. విండీస్ ఓపెనర్ల అరుదైన ఘనత
Zimbabwe vs West Indies, 1st Test- బులవాయో: వెస్టిండీస్, జింబాబ్వే మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. మ్యాచ్ చివరిరోజు వెస్టిండీస్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 54 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 5 వికెట్లకు 203 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. బ్రాత్‌వైట్ (25; 3 ఫోర్లు), తేజ్‌నరైన్ (15) టెస్టు మ్యాచ్‌లో వరుసగా ఐదు రోజులు ఆడిన తొలి ఓపెనింగ్ జోడీగా గుర్తింపు పొందింది. ఇక ఈ మ్యాచ్‌లో అజేయ డబుల్ సెంచరీ(207)తో మెరిసిన తేజ్‌నరైన్ చందర్‌పాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్ తొలి టెస్టు 2023 మ్యాచ్ స్కోర్లు వెస్టిండీస్- 447/6 డిక్లేర్డ్ & 203/5 డిక్లేర్డ్ జింబాబ్వే- 379/9 డిక్లేర్డ్ & 134/6 చదవండి: Gary Ballance: రెండు దేశాల తరఫున సెంచరీలు.. ఎన్నో ఆసక్తికర విశేషాలు