![South Africa better batting performance in the second innings](/styles/webp/s3/article_images/2024/08/17/sa_1.jpg.webp?itok=Ng-3w-kN)
ప్రొవిడెన్స్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. రెండో ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లలో వికెట్ నష్టానికి 93 పరుగులు చేసింది. దాంతో దక్షిణాఫ్రికా ఆధిక్యం 109 పరుగులకు చేరింది. టోనీ జోర్జి (39) రాణించాడు. అంతకు ముందు దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్‌లో 16 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. సఫారీ బౌలర్ల ధాటికి వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులకే ఆలౌటైంది.
జేసన్ హోల్డర్ (88 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరిపోరాటం చేసి అర్ధసెంచరీ సాధించాడు. వియాన్ ముల్డర్ (4/32), బర్గర్ (3/49), కేశవ్ మహరాజ్ (2/8) విండీస్‌ను దెబ్బ తీశారు. దక్షిణాఫ్రికా కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగుల వద్దే 9వ వికెట్ కోల్పోయినా...డీన్ పీట్ (38 నాటౌట్), బర్గర్ (23) కలిసి 63 పరుగుల చివరి వికెట్ భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment