లండన్: యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు పోరాటం సాగిస్తోంది. ఒకదశలో 188/1తో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ జట్టు 34 పరుగుల తేడాలో మూడు వికెట్లు కోల్పోయి 222/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో మరో రెండు వికెట్లు పడి ఉంటే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కుప్పకూలేది! కానీ హ్యారీ బ్రూక్ (51 బంతుల్లో 45 బ్యాటింగ్; 4 ఫోర్లు), కెప్టెన్ బెన్ స్టోక్స్ (57 బంతుల్లో 17 బ్యాటింగ్; 1 ఫోర్) పట్టుదలతో ఆడి ఐదో వికెట్‌కు అజేయంగా 56 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 61 ఓవర్లలో 4 వికెట్లకు 278 పరుగులు చేసింది.
ఓపెనర్లు జాక్ క్రాలీ (48; 5 ఫోర్లు) రెండు పరుగులతో అర్ధ సెంచరీ... డకెట్ (98; 9 ఫోర్లు) రెండు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నారు. ఓలీ పోప్ (42; 4 ఫోర్లు) రాణించగా, జో రూట్ (10) విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా స్కోరుకు ఇంగ్లండ్ మరో 138 పరుగుల దూరంలో ఉంది. మూడో రోజు స్టోక్స్, బ్రూక్‌లతోపాటు బెయిర్‌స్టో క్రీజులో నిలబడితే ఇంగ్లండ్ జట్టు ఈ మ్యాచ్‌పై ఆశలు ఉంచుకోవచ్చు.
ఆసీస్ మేటి స్పిన్నర్ నాథన్ లయన్ కాలి పిక్క గాయం కారణంగా మూడో రోజు బౌలింగ్‌కు దిగుతాడో లేదో అనుమానం. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 339/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 77 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయి 416 పరుగులవద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (110; 15 ఫోర్లు) కెరీర్‌లో 32వ సెంచరీ సాధించడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్, జోష్ టంగ్ మూడు వికెట్ల చొప్పున తీశారు.
22 టెస్టులోని తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు. ఇప్పటి వరకు స్మిత్ తొలి ఇన్నింగ్స్‌లో 22 సెంచరీలు చేశాడు. 21 సెంచరీలతో రికీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డును స్మిత్ సవరించాడు.
Comments
Please login to add a commentAdd a comment