
నాటింగ్‌హమ్: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు 241 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. నాలుగో రోజు ఇంగ్లండ్ నిర్దేశించిన 385 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 36.1 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలింది.
ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ 41 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బ తీశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 248/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 92.2 ఓవర్లలో 425 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (109; 13 ఫోర్లు), జో రూట్ (122; 10 ఫోర్లు) సెంచరీలు సాధించారు.