నేటి నుంచి ఇంగ్లండ్, విండీస్‌ రెండో టెస్టు... వుడ్‌కు చోటు | From today second test between England and West Indies | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంగ్లండ్, విండీస్‌ రెండో టెస్టు... వుడ్‌కు చోటు

Published Thu, Jul 18 2024 3:39 AM | Last Updated on Thu, Jul 18 2024 9:18 AM

From today second test between England and West Indies

వెస్టిండీస్‌ జట్టుతో నేడు నాటింగ్‌హామ్‌లో మొదలయ్యే రెండో టెస్టులో ఇంగ్లండ్‌ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టు తర్వాత ఇంగ్లండ్‌ పేసర్‌ అండర్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 

ఈ నేపథ్యంలో అండర్సన్‌ స్థానంలో రెండో టెస్టు కోసం మరో పేస్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌కు ఇంగ్లండ్‌ తుది జట్టులో చోటు లభించింది. 34 ఏళ్ల మార్క్‌ వుడ్‌ ఇప్పటి వరకు 34 టెస్టులు ఆడి 108 వికెట్లు పడగొట్టాడు. మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్‌ తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 114 పరుగుల తేడాతో గెలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement