ఇంగ్లండ్‌ లక్ష్యం 371: ప్రస్తుతం 114/4 | England is heading towards defeat | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ లక్ష్యం 371: ప్రస్తుతం 114/4

Published Sun, Jul 2 2023 2:45 AM | Last Updated on Sun, Jul 2 2023 2:45 AM

England is heading towards defeat - Sakshi

లండన్‌: యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగడంతో ఇంగ్లండ్‌ ఓటమి దిశగా పయనిస్తోంది. 371 పరుగుల లక్ష్యంతో  రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఆసీస్‌ సీమర్లు స్టార్క్‌ (2/40), కమిన్స్‌ (2/20) వణికించారు. దీంతో ఆట నిలిచే సమయానికి ఇంగ్లండ్‌ 31 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. డకెట్‌  (50 బ్యాటింగ్‌; 6 ఫోర్లు), స్టోక్స్‌ (29 బ్యాటింగ్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) క్రీజులో ఉన్నారు.

సీమర్‌ స్టార్క్‌ ధాటికి ఓపెనర్‌ క్రాలీ (3), ఒలీ పోప్‌ (3) నిలువలేకపోయారు. కమిన్స్‌... రూట్‌ (18; 2 ఫోర్లు), బ్రూక్‌ (4)లను అవుట్‌ చేశాడు. విజయానికి ఇంకా 257 పరుగుల దూరంలో ఉన్న ఇంగ్లండ్‌ చేతిలో 6 వికెట్లున్నాయి. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 130/2తో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆ్రస్టేలియా 101.5 ఓవర్లలో 279 పరుగుల వద్ద ఆలౌటైంది.

డ్రింక్స్‌ విరామం వరకు ఖ్వాజా (77; 12 ఫోర్లు), స్మిత్‌ (34; 5 ఫోర్లు) బాగానే ఆడినప్పటికీ తర్వాత స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరితో పాటు హెడ్‌ (7) వికెట్‌ను కోల్పోయింది. రెండో సెషన్‌లో ఇంగ్లండ్‌ బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 40 పరుగుల వ్యవ ధిలో మిగతా సగం వికెట్లను కోల్పోయి ఆలౌటైంది. బ్రాడ్‌ 4, టంగ్, రాబిన్సన్‌ చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగుల ఆధిక్యం కలుపుకొని ఆసీస్‌ ప్రత్యర్థి ముందు 371 లక్ష్యాన్ని నిర్దేశించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement