లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా గురువారం రెండో టెస్ట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ సేన 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(127) అజేయ సెంచరీతో అదరగొట్టగా, రోహిత్ శర్మ(83), కోహ్లీ(42)లు రాణించారు. తొలి రోజు ఆట అనంతరం ఓపెనర్ రోహిత్ శర్మ పాల్గొన్న వర్చువల్ మీడియా సమావేశంలో ఓ ఆసక్తికర సన్నివేశం తారసపడింది. ఈ సమావేశంలో విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు రోహిత్ సెల్యూట్ చేశాడు.
😂😂😂😂
— Amey Pethkar 🇮🇳🇦🇪 (@ameyp9) August 13, 2021
pic.twitter.com/7Jrga8FNcd
భారత స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోయే పంద్రాగస్టు నాడు విజయాన్ని గిఫ్ట్‌గా ఇస్తారా అని సదరు రిపోర్టర్ ప్రశ్నించగా, పై విధంగా స్పందించాడు. అలా జరగాలనే కోరుకుంటున్నాము.. అదే జరిగితే అది భారత క్రికెట్‌కు గొప్ప గౌరవంగా నిలుస్తుందని బదులిచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి రోహిత్ శర్మ టీమిండియాకు శుభారంభాన్ని అందించాడు. అయితే, 83 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆండర్సన్ బౌలింగ్ క్లీన్‌బౌల్డ్ అయ్యి సెంచరీ చేసే ఛాన్స్‌ను మిస్ చేసుకున్నాడు. రోహిత్, రాహుల్ జోడీ తొలి వికెట్‌కు 126 పరుగులు జోడించడంతో లార్డ్స్ మైదానంలో 69 ఏళ్ల రికార్డు బద్దలయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment