Suniel Shetty's Shout Out To KL Rahul Wins The Internet- Sakshi
Sakshi News home page

KL Rahul: కంగ్రాట్స్‌ బాబా.. బర్త్‌డే గిప్ట్‌ అదిరింది: సునీల్‌ శెట్టి

Published Fri, Aug 13 2021 12:14 PM | Last Updated on Fri, Aug 13 2021 1:09 PM

Suniel Shettys Shout Out To KL Rahul Wins The Internet - Sakshi

KL Rahul 100@ Cricket Mecca: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అజేయమైన సెంచరీ(248 బంతుల్లో 127; 12 ఫోర్లు, సిక్స్‌)తో అదరగొట్టాడు. క్రికెట్‌ మక్కాగా పేరొందిన ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన మూడో భారత ఓపెనర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ సందర్భంగా రాహుల్‌పై సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రేయసి అతియా శెట్టితో పాటు ఆమె తండ్రి, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కూడా రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారి జాబితాలో ఉన్నారు. 

కాగా,  రాహుల్‌ శతకొట్టిన క్లిప్‌ను జోడిస్తూ.. సునీల్‌ శెట్టి ఇన్‌స్టాలో షేర్‌ చేసిన పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. 100@ క్రికెట్‌ మక్కా.. కంగ్రాట్స్‌ అండ్‌ గాడ్‌ బ్లెస్‌ యు బాబా.. నా బర్త్‌డే(ఆగస్ట్‌ 11)కు నువ్విచ్చిన గిఫ్ట్‌ చాలా అపురూపమంటూ అతను చేసిన కామెంట్స్‌ నెటిజన్లను విపరీతంగా ఆకర్శించింది. సునీల్‌ శెట్టి.. రాహుల్‌కు శుభాకాంక్షలు తెలపిన విధానం, రాహుల్‌ను బాబా అని సంబోదిస్తూ ఆశీర్వదించడంపై  నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మరోవైపు అతియా శెట్టి కూడా రాహుల్ సెంచ‌రీపై పోస్ట్ చేసింది. కేఎల్ రాహుల్‌ను ట్యాగ్ చేస్తూ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఎరుపు రంగు హార్ట్ ఐకాన్‌ను పోస్ట్ చేసింది.

కాగా, వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ కోసం రాహుల్‌తో పాటు అతియా కూడా ఇంగ్లండ్‌కు వెళ్లింది. రాహుల్‌ అతియాను త‌న పార్ట్‌న‌ర్‌ అని బీసీసీఐకి చెప్పడం విశేషం. ఈ ఇద్ద‌రూ గత రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. పిల్ల‌లు ఆనందంగా ఉంటే చాలు అంటూ గ‌తంలో సునీల్ శెట్టి దంపతులు కూడా వీళ్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఇదిలా ఉంటే, కేఎల్‌ రాహుల్‌ అజేయమైన శతకంతో పాటు రోహిత్‌ శర్మ(83), కోహ్లీ(42)లు రాణించడంతో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. వన్‌ డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా(9) మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం రాహుల్‌తో పాటు రహానే(1) క్రీజ్లో ఉన్నాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆండర్సన్‌ 2, రాబిన్సన్‌కు ఓ వికెట్‌ దక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement