
ఐపీఎల్-2024లో మరో రసవత్తరపోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.
కాగా ఈ రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశాయి. సీఎస్‌కే లక్నో సూపర్ జెయింట్స్‌తో చేతిలో పరాజయం పాలవ్వగా.. ఎస్ఆర్‌హెచ్ ఆర్సీబీపై ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో ఎస్ఆర్‌హెచ్ మూడో స్ధానంలో కొనసాగుతుండగా.. సీఎస్‌కే ఆరో స్ధానంలో ఉంది.
తుది జట్లు
చెన్నై సూపర్ కింగ్స్ : అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్