Ind vs Aus 3rd Test: వదలని వర్షం.. ముగిసిపోయిన తొలిరోజు ఆట | Ind vs Aus 3rd Test Brisbane Playing XI Updates And Highlights | Sakshi
Sakshi News home page

Ind vs Aus 3rd Test: వదలని వర్షం.. ముగిసిపోయిన తొలిరోజు ఆట

Published Sat, Dec 14 2024 6:46 AM | Last Updated on Sat, Dec 14 2024 11:51 AM

Ind vs Aus 3rd Test Brisbane Playing XI Updates And Highlights

Ind vs Aus 3rd Test Day 1 Updates: ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య శనివారం మూడో టెస్టు మొదలైంది. బ్రిస్బేన్‌లోన గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో తొలిరోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. ఆసీస్‌ బ్యాటింగ్‌కు దిగింది. అయితే, వర్షం కారణంగా 13.2 ఓవర్ల తర్వాత ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత కూడా ఎడతెరిపి లేకుండా వాన పడటంతో అంపైర్లు తొలి రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు

ఆటకు వర్షం ఆటంకం
బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌- ఆస్ట్రేలియా మధ్య మొదలైన తొలిరోజు ఆటకు వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను ప్రస్తుతానికి నిలిపివేశారు. ఆసీస్‌ స్కోరు:  28/0 (13.2). ఖవాజా 19, మెక్‌స్వీనీ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

పది ఓవర్లలో ఆసీస్‌ స్కోరు: 26-0
ఖవాజా 18, మెక్‌స్వీనీ మూడు పరుగులతో ఆడుతున్నారు.

ఆరు ఓవర్లలో ఆసీస్‌ స్కోరు
భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా భారత బౌలింగ్‌ అటాక్‌ ప్రారంభించాడు. ఇక రోహిత్‌ సేన ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ కోల్పోకుండా 23 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్‌ ఖవాజా 17, నాథన్‌ మెక్‌స్వీనీ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

వాళ్లిద్దరిపై వేటు
టాస్‌ సందర్భంగా రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో రవీంద్ర జడేజా, హర్షిత్‌ రాణా స్థానంలో ఆకాశ్‌ దీప్‌ను తీసుకున్నట్లు తెలిపాడు. 

ఒక మార్పుతో ఆసీస్‌
మరోవైపు.. ఆస్ట్రేలియా సైతం ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఒక మార్పు చేసింది. గాయం నుంచి కోలుకున్న పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ తిరిగి రావడంతో.. స్కాట్‌ బోలాండ్‌పై వేటు పడింది.

తుదిజట్లు
టీమిండియా
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్‌ పంత్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.

ఆస్ట్రేలియా
ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ( వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హాజిల్‌వుడ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement